నీ పనైపోయిందంటూ.. గంభీర్ వార్నింగ్ ఇచ్చాడు : మనోజ్ తివారి

praveen
సాదరణంగా క్రికెట్ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో ఆటగాళ్ళు జట్టును గెలిపించుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఆటగాళ్లు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంతో కూల్ గా ఉంటూ మ్యాచ్ పరిస్థితులను తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొంద మంది ఆటగాళ్లు మాత్రం ఇక జట్టును గెలిపించుకోవడానికి ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా మ్యాచ్ జరుగుతున్న సమయంలో తరచూ ప్రత్యర్ధులతో గొడవ పడిన భారత ఆటగాళ్లలో గౌతమ్ గంభీర్ మొదటి స్థానంలో ఉంటారు.

 ఏది ఉన్న ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే క్రికెట్ తో ఎంత అయితే గౌతమ్ గంభీర్ గుర్తింపును సంపాదించుకున్నాడో.. ఇక అటు వివాదాలతో గొడవలతో కూడా అంతకంటే ఎక్కువగానే వార్తల్లో నిలిచాడు అని చెప్పాలి. అయితే ఇలా గౌతమ్ గంభీర్ వివాదాలు పెట్టుకున్న వారిలో ఎంతోమంది భారతి క్రికెటర్లు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఇటీవల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మనోజ్ తివారి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అప్పట్లో గంభీర్ మనోజ్ తివారి మధ్య జరిగిన గొడవ భారత క్రికెట్లో సంచలనంగా మారిపోయింది. ఏకంగా ఒకరికి ఒకరు వార్నింగులు కూడా ఇచ్చుకున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవలే ఒక అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న మనోజ్ తివారి గౌతమ్ గంభీర్ తో జరిగిన గొడవ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 గౌతమ్ గంభీర్ తో తనకు గొడవ జరిగింది. ఆ సమయంలో ఆసక్తికర ఘటన జరిగింది. రాంజీ ట్రోఫీ జరుగుతుండగా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత బయట కలువ్.. నీ పని అయిపోయింది ఈరోజు అని గౌతమ్ గంభీర్ వార్నింగ్ ఇచ్చాడు. నేను కూడా అతన్ని చాలానే అన్నాను. అయితే కోల్కతా నైట్ రైడర్స్ కి ఆడినప్పుడు చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం. కానీ ఈ వివాదం తర్వాత కాస్త దూరం పెరిగింది. గౌతమ్ గంభీర్ విషయంలో అదొక్కటే నేను చింతించే విషయం అంటూ మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలే అన్ని స్థాయిల క్రికెట్ నుంచి కూడా అతను రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: