విలేజ్ ప్లేయర్ కి వరంలో మారిన 'ఆడుదాం ఆంధ్రా'.. ఏకంగా ఐపీఎల్ లో ఛాన్స్?

praveen
టాలెంట్ ఉండాలే కానీ అవకాశాలు వాటికవే వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూ ఉంటారు  ఇది నిజమే అన్నదానికి నిదర్శనంగా కొన్ని కొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే  ఇక ఇప్పుడు ఒక విలేజ్ ప్లేయర్ విషయంలో కూడా ఇదే జరిగింది. సాధారణంగా ఐపీఎల్ లో ఛాన్సులు దక్కించుకోవాలంటే రంజీ ట్రోఫీ లాంటి దేశవాళి టోర్నీ లలో బాగా రాణించాలి  అలా రాణించినప్పుడే ఇక ఐపీఎల్ లో సెలెక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విలేజ్ ప్లేయర్ కి అనుకోని అదృష్టం వరించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్ర కారణంగా విజయనగరం జిల్లాకు చెందిన ఒక గ్రామస్థాయి క్రీడాకారుడు కి ఒక లక్కీ ఛాన్స్ దక్కింది.

 ఇండియాలో మెగా క్రికెట్ పండుగగా పిలుచుకునే ipl టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు. జామి మండలం ఆలమండ గ్రామానికి చెందిన కే పవన్ అనే 21 ఏళ్ళ  యువకుడు ఆడుదాం ఆంధ్ర లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బౌలింగ్ ఫీల్డింగ్  లో రాణిస్తున్నాడు  అయితే పరిశీలకులు క్రికెట్ నిపుణులు  అతని ప్రతిభకు మంత్రముగ్ధులు అయిపోయారు. ఈ క్రమంలోనే అతని పేరును ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ కు సిఫారసు చేశారు. దీంతో పవన్ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ముందుకు వచ్చింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పవన్ గడ్డితో కప్పబడిన ఇంట్లో ఉంటున్నాడు. అతనిని ఇప్పుడు సీఎస్కే టీం మేనేజ్మెంట్ దత్తత తీసుకుంటుంది. నిర్దిష్టకాలం పాటు అతనికి సరైన శిక్షణ ఇచ్చిన తర్వాత జట్టులో సభ్యుడుగా మార్చుకుంటుంది. కాగా తల్లిదండ్రులను కోల్పోయి మేనమామ దగ్గర పెరుగుతున్న పవన్ తన ప్రతిభను మరింత మెరుగుపరచుకోవడానికి ఇక ఇప్పుడు ఒక గొప్ప అవకాశం దక్కింది అని చెప్పాలి.

ఐపీఎల్ లో ఛాన్స్ రావడం పై స్పందించిన పవన్.. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ ఈవెంట్ తన జీవితానికి ఒక వరంలా మారిపోయింది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: