యువరాజ్ సింగ్ పొలిటికల్ ఎంట్రీ.. ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నాడంటే?

praveen
సాదరణంగా అంతర్జాతీయ క్రికెట్లో దశాబ్ద కాలానికి పైగా ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఏదో ఒక సమయంలో ఇక ఆటకు వీడ్కోలు పలకడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కూడా క్రికెట్ కు ఏదో ఒక విధంగా దగ్గరగా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొంతమంది ప్లేయర్లు ఏకంగా వ్యాఖ్యాతలుగా మారి తమ గాత్రంతో క్రికెట్ మ్యాచ్లను ఉత్కంఠ గా మారుస్తూ ఉంటే.. ఇంకొంతమంది ఏకంగా క్రికెట్ జట్లకు కోచ్ లుగా మారి తమ అనుభవాలతో యువ ఆటగాళ్ల నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది మాజీ ప్లేయర్లు వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్కు ఎక్కడ సంబంధం లేని పాలిటిక్స్ ను కెరియర్ గా ఎంచుకుంటూ ఉన్నారు. ఏకంగా పొలిటిషియన్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. ఏకంగా రాజకీయ నాయకుల లాగా ప్రచారాలను నిర్వహిస్తూ తమకు ఓటు వేయాలి అంటూ ఇక ఓటరు మహాశయులందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు మారో లెజెండరీ క్రికెటర్ కూడా ఇలాగే పాలిటిక్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడట. భారత జట్టులో అత్యుత్తమ ఆల్రౌండర్ గా పేరు సంపాదించుకున్న మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నది తెలుస్తోంది. ఏకంగా మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బిజెపి తరఫున ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట. పంజాబ్ లోని గురుదాస్పూర్ లేదా చండీగఢ్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గట్కరిని యువరాజ్ సింగ్ కలిసినప్పటి నుంచి ఆయన పొలిటికల్ ఎంట్రీ పై వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం యువరాజ్ లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: