500వ వికెట్ ను.. అశ్విన్ ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా?

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ బౌలింగ్తో ఎంత ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అశ్విన్ ను ఎంతో తెలివైన స్పిన్నర్ అని అటు విశ్లేషకులు కూడా అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ బ్యాట్స్మెన్ కు ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే అశ్విన్ తన ఆట తీరుతో ఇప్పటికే క్రికెట్లో లెజెండ్ గా ఎదిగేసాడు. యువ ఆటగాళ్ల హవా పెరిగిపోయినప్పటికీ తన ఆట తీరుతో ఎప్పటికప్పుడు తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకుంటూనే ఉన్నాడు

 ఇక టీన్ ఇండియా ఎప్పుడు టెస్ట్ సిరీస్ లో మ్యాచ్లు ఆడిన కూడా అటు రవిచంద్రన్ అశ్విన్  జట్టులో కొనసాగుతూనే వస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఎప్పుడు ఇంగ్లాండ్, టీమిండియా మధ్య మ్యాచ్లో టెక్స్ట్ సిరీస్ జరుగుతుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా అశ్విన్ తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. మొదటి మ్యాచ్ నుంచి కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ తీయడం ద్వారా ఏకంగా అరుదైన మైలురాయిని అందుకున్నాడు సచిన్ టెండూల్కర్.

 ఇటీవల జరిగిన మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో ఇక ఒక వికెట్ తీయడం ద్వారా ఏకంగా టెస్ట్ ఫార్మాట్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అశ్విన్ తో అతనిపై ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి. కాగా 500 వికెట్లు తీయడంపై ఇటీవలే అశ్విన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. నేను ఈ 500వ వికెట్ ను మా నాన్నకు అంకితకు ఇవ్వాలని అనుకుంటున్నాను. నా జీవితంలో నేను చేసిన ప్రతి దాంట్లో ఆయన నాకు సపోర్ట్ గా ఉన్నారు. ఆయన నిరంతరం నా ఆటను టీవీలో చూస్తూ మద్దతు ఇస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు 500 వికెట్లు పూర్తయ్యాయి అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: