ఒక్క బంతి వెయ్యకుండానే.. ఇంగ్లాండుకు 6 పరుగులు ఇచ్చిన టీమిండియా?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ ఆడేందుకు అటు ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. అయితే ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు ముగించుకున్న టీమిండియా.. ఇక ఇప్పుడూ నేడు మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉంది. కాగా మొదట ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా.. అద్భుతమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. భారత బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఇంగ్లాండ్  బౌలర్లతో చెడుగుడు ఆడేశారు. ఏకంగా భారీగా పరుగులు చేశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి టీమిండియా ఏకంగా 445 పరుగులు చేసింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భారీ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఇలా ఇరు జట్ల మధ్య మొదటి ఇన్నింగ్స్ హోరాహోరీగా జరుగుతూ ఉండగా.. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది అని చెప్పాలి. మొదటి ఓవర్ ను బుమ్రా వేశాడు. అయితే బుమ్రా ఒక్క బంతి కూడా సంధించకుండానే ఏకంగా ఇంగ్లాండ్ జట్టు ఖాతాలో ఆరు పరుగులు చేరిపోయాయి. అదేంటి బంతి వేసిన తర్వాత అవి వైడ్ లేదా నోబాల్ వెళ్ళినప్పుడు లేదంటే బ్యాట్స్మెన్ ఆ బంతిని షాట్ ఆడి పరుగులు తీసినప్పుడు మాత్రమే కదా.. బ్యాటింగ్ చేస్తున్న టీం కి పరుగులు వచ్చేది. అలా కాకుండా ఒక బంతి వేయకుండా ఎలా ఆరు పరుగులను ఇంగ్లాండ్ దక్కించుకుంది అని అనుకుంటున్నారు కదా.

 ఇలా జరగడానికి వెనుక పెద్ద కారణమే ఉంది. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో ఒక అరుదైన  రికార్డు నమోదయింది. బంతి ఎదుర్కోకుండానే ఇంగ్లాండ్ తమ ఖాతాలో ఆరు పరుగులు చేర్చుకుంది. భారత్ బ్యాటింగ్ సమయంలో అశ్విన్ పిచ్ పై డేంజర్ జోన్ లో అడుగులు వేయడంతో.. అశ్విన్ కు ఎంపైర్ చివరికి ఐదు పరుగుల పెనాల్టీ వేశారు. దీనికి తోడు తొలి ఓవర్లో బుమ్రా వేసిన బంతి నోబాల్ గా వెళ్ళింది. దీంతో అంతకుముందు అశ్విన్ పై వేసిన ఐదు పరుగుల పెనాల్టీ.. ఇక భూమిరా వేసిన నోబాల్ కలిపి ఇలా భారత జట్టు ఒక్క బంతి వేయకుండానే ఏకంగా ఇంగ్లాండ్ కు ఆరు పరుగులు ఇచ్చేసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: