హార్థిక్ పాండ్యాకు ఒక్కడికే మినహాయింపు ఎందుకు.. బీసీసీఐపై విమర్శలు?

praveen
టీమిండియా జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న ఇషాన్ కిషన్ గత కొంతకాలం నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో మానసిక అలసట అనే కారణం చెప్పి అతను జట్టు నుంచి అర్ధాకరంగా తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చేసాడు. అయితే ఇలా ఇండియాకు వచ్చిన తర్వాత కనీసం క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేయకుండా పూర్తిగా ఆటకు దూరంగానే ఉన్నాడు. అయితే అతను రంజీ ట్రోఫీలో ఆడితేనే మళ్లీ టీమిండియాలోకి తీసుకుంటాము అంటూ అటు జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపిన అతని ఆదేశాలను సైతం ధిక్కరించాడు.

 ఈ క్రమంలోనే అతని విషయంలో బీసీసీఐ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా అతను దేశ వాళి టోర్నీలలో ఆడకపోతే అతనికి ఐపీఎల్లో ఆడే ఛాన్స్ కూడా ఇవ్వబోము అంటూ స్పష్టం చేసింది. అంతేకాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ను కూడా రద్దు చేస్తాం అంటూ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇషాన్ కిషన్ తప్పకుండా రంజీలు ఆడాల్సిందే అంటూ స్పష్టం చేసింది. కేవలం ఇషాన్ కిషన్ మాత్రమే కాదు ఇక గత కొంతకాలం నుంచి క్రికెట్కు దూరంగా ఉంటూ కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతూ వస్తున్న కృనాల్ పాండ్యా దీపక్ ఇలాంటి ఆటగాళ్లకు సైతం బీసీసీఐ ఇలాంటి ఆదేశాలను జారీ చేసింది.

 ఇక ఇలాంటి ఆదేశాలపై అటు కొంతమంది అభిమానులు మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. రూల్ ఇస్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అన్న విధంగా ఉండాలి. అంతేకానీ ఇక కొంతమంది పై కఠినంగా వ్యవహరించి ఇంకొంతమందికి మాత్రం మినహాయింపు ఇవ్వడమేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, దీపక్ లాంటి ఆటగాళ్లకు దేశ వాలీలు ఆడితేనే ఐపీఎల్ ఆడే అవకాశం ఉంటుంది అని చెప్పిన బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు ఎందుకు మినహాయింపు ఇచ్చింది అనే విషయంపై మాత్రం ప్రశ్నిస్తున్నారు. అతనొక్కడికే మినహాయింపు ఇవ్వడం వెనక.. అతను బిసిసిఐ సెక్రటరీ జై షాకు క్లోజ్ గా ఉండడమే కారణమా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: