ఐపీఎల్ లో ఫ్రాంచైజీల ఆటలు కుదరవు.. బీసీసీఐదే తుది నిర్ణయం : జైషా

praveen
ఈ మధ్యకాలంలో భారత ప్లేయర్లు అందరూ కూడా తరచూ గాయాల బారిన పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా కీలకమైన టోర్నీలు ఆడుతున్న సమయంలో.. ఇలా ఆటగాళ్లు గాయాలు అటు భారత జట్టుకు పెద్ద సమస్యగా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ఇలా తరచూ ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఉండడం.. ఇక ఇలాంటి గాయాల నేపథ్యంలో భారత జట్టు ఇక కీలకమైన టోర్నీలలో పెద్దగా రాణించకపోవడంతో.. బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బీసీసీఐ ఆదాయాన్ని చూసుకుంటుంది. తప్ప ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో దృష్టి పెట్టడం లేదు అంటూ ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆటగాళ్లు తమకు దొరికిన ఖాళీ సమయాన్ని విశ్రాంతి తీసుకోకుండా ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఆడుతూఉన్నారు అంటూ ఆరోపిస్తున్నారు.

 ఇలా ఐపిఎల్ లో ఆడటం కారణంగానే ఎంతోమంది ప్లేయర్లు అటు భారత జట్టుకు ఆడే సమయంలో గాయం బారిన పడుతున్నారని.. ఇంకొంతమంది దేశవాళి క్రికెట్ కి కూడా అందుబాటులో లేకుండా పోతున్నారు అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. టీమిండియాకు ఆడే ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడటం విషయంలో కొన్ని నిబంధనలు విధిస్తే బాగుంటుందని.. పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయం గురించి బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఆటగాళ్ల నిర్వహణ విషయంలో ఇక ఐపీఎల్ లోని ఫ్రాంచైజీలు ఎలా పడితే అలా వ్యవహరిస్తాం అంటే ఊరుకోము అంటూ స్పష్టం చేశాడు జై షా. ఈ విషయంలో బీసీసీఐదే అత్యున్నత అధికారం. ఇక తుది నిర్ణయం కూడా అదే.. బీసీసీఐ ఏం చెబితే ఐపిఎల్ లోని అన్ని జట్లు కూడా అది చేయాల్సిందే అంటూ జే షా స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే జై షా చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్టుకు ఆడేందుకు మాత్రమే ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాయి అని విమర్శలు వస్తున్న వేళ ఇక ఇప్పుడు జై షా ఇలాంటి విమర్శలకు పుల్ స్టాప్ పెట్టేసాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: