చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. రోహిత్ ని దాటేసాడు?

praveen
టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవీంద్ర జడేజా. తన ఆటతీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఆల్రౌండర్ అనే పదానికి అసలు సిసలైన కేరాఫ్ అడ్రస్గా కొనసాగుతూ ఉంటాడు. తన ఆటతీరుతో ఎప్పుడూ భారత విజయాలలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేయడమే కాదు బ్యాటింగ్ తో ఇక ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు కూడా ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చే రవీంద్ర జడేజా ఇక బ్యాట్ తో విధ్వంసం సృష్టిస్తాడు అని చెప్పాలి. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటాడు. అయితే ఇక ఇప్పుడు భారత జట్టు అటు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉండగా.. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో కూడా కీలక ప్లేయర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక రెండో టెస్టులో గాయం బారిన పడిన జడేజా మూడో టెస్ట్ కు అందుబాటులో ఉంటాడో లేదో అని అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఫిట్నెస్ సాధించడంతో మళ్ళీ మూడో టెస్టులో అందుబాటులోకి వచ్చేసాడు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం మూడో టెస్ట్ మ్యాచ్లో భాగంగా తన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు రవీంద్ర జడేజా.ఇక ఈ మూడో టెస్టులో భారీగా పరుగులు చేయడంతో చరిత్ర సృష్టించాడు. ఇక అర్థ సెంచరీ తో చెలరేగిపోయాడు. దీంతో 2018 నుంచి ఇండియాలో టెస్టుల్లో అత్యధిక 50 ప్లస్ పరుగులు  సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు రవీంద్ర జడేజా. ఇప్పటివరకు జడేజా సొంత గడ్డపై 9 అర్థ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత స్థానాలలో రోహిత్ శర్మ ఏడు, రిషబ్ పంత్ 7, చటేశ్వర్ పూజార ఏడు హాఫ్ సెంచరీలతో ఉన్నారు. అయితే ఇక రవీంద్ర జడేజా చేసిన అర్థ సెంచరీని సెంచరీగా మలిచి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: