ధోనీకి ఇదేం కొత్త కాదు.. నాకోసం కోట్లు వదులుకున్నాడు : కోహ్లీ

praveen
టీమిడియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ఏకంగా దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు ధోని. అంతేకాదు ఇక తన కెప్టెన్సీ తో ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. టీమిండియాకు అందని ద్రాక్ష లాగా ఉన్న వరల్డ్ కప్ ను రెండుసార్లు అందించి ఇక ఇండియన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు. మిస్టర్ కూల్ కెప్టెన్ గా బెస్ట్ వికెట్ కీపర్ గా అత్యుత్తమ ఫినిషిర్ గా కూడా వరల్డ్ క్రికెట్లో గుర్తింపును సంపాదించుకున్నాడు ధోని.

 ధోని అంటే కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు ధోని అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ అన్న విధంగా ప్రస్తానాన్ని కొనసాగించాడు అని చెప్పాలి. అలాంటి మహేంద్ర సింగ్ ధోని ఇక ప్రస్తుతం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ ఇక అతని బ్రాండ్ వాల్యూ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం ఏదైనా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు అంటే చాలు ఇక కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కంపెనీలు ఎప్పుడు ముందుకు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అలాంటి ధోని కొన్ని కొన్ని సార్లు ఏకంగా కోట్ల రూపాయలను వదులుకునేందుకు కూడా సిద్ధపడుతూ ఉంటాడు అని చెప్పాలి.

 ఇదే విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నెట్ ప్రాక్టీస్ లో ఇటీవల ధోని తన స్నేహితుని షాపు యొక్క స్టిక్కర్ను అతికించుకొని ఇక బ్యాటింగ్ చేయడం కనిపించింది. దీంతో ధోనీ పై ప్రశంసలు కురుస్తున్నాయ్. అయితే మహేంద్రుడుకి  ఇది కొత్తేమీ కాదని BAS బ్యాట్ల తయారీ కంపెనీదారు సోమీ కోహ్లీ వెల్లడించారు. 2019 వరల్డ్ కప్ లో నాకోసం ధోని కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును వదులుకొని.. నా కంపెనీ బ్యాట్ వాడారు. రూపాయి కూడా అడగలేదు అంటూ సోమీ కోహ్లీ చెప్పుకొచ్చారు. 1998లో ధోని కెరియర్ ప్రారంభంలో సోమీ కోహ్లీ అటు ధోని కి హెల్ప్ చేశారట. ఇక అందుకు కృతజ్ఞతగా ధోని ఏకంగా BAS కంపెనీ బ్యాట్ ను ఒక రూపాయి కూడా తీసుకోకుండా వాడేసారట. ఇదే బ్యాటుతో గతంలో పాకిస్తాన్ పై 148 పరుగులు చేసి సెంచరీ తో అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: