చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్ ప్లేయర్.. అతిపెద్ద వయసులో?

praveen
అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లని మరింత ప్రోత్సాహించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడు ర్యాంకింగ్స్ ని ప్రకటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసిసి ప్రకటించే ర్యాంకింగ్స్ లో ఎప్పుడు అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవాలని.. ప్రతి ఒక్క క్రికెటర్ కూడా ఆశ పడుతూ ఉంటాడు. తాము ర్యాంకులను పెద్దగా పట్టించుకోము అని పైపైకి చెబుతున్న.. ఇక అగ్రస్థానం దక్కితే ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి అని చెప్పాలి.

 అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మూడు ఫార్మాట్లకు సంబంధించిన ర్యాంకింగ్స్ ని విడివిడిగా ప్రకటిస్తూ ఉంటుంది. అంతేకాకుండా బ్యాటర్,  బౌలింగ్, ఆల్రౌండర్లకు సంబంధించిన ర్యాంకింగ్స్ ని కూడా ఇలా విడివిడిగా ప్రకటిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు ఆల్ రౌండర్ మహమ్మద్ నభి.

 అయితే ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో వన్డే ఆల్రౌండర్ల జాబితా లో ఏకంగా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు మహమ్మద్ నభి. అయితే అతిపెద్ద వయస్సులో టాప్ ర్యాంకును సొంతం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు అని చెప్పాలి. ఏకంగా 39 ఏళ్ల 43 రోజుల వయసులో ఇలా అగ్రస్థానాన్ని అందుకోవడం గమనార్హం. అంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం తిలకరత్నే దిల్షాన్  పేరిట ఉండేది. 38 ఏళ్ల ఎనిమిది రోజుల వయసులో ఆయన ఈ రికార్డు అందుకున్నాడు. అలాగే 2019 మే 7 నుంచి వరుసగా 1739 రోజులపాటు అగ్రస్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ప్లేయర్ షాకీబ్ ఆల్ హాసన్ ను తొలిసారి అధిగమించాడు మహమ్మద్ నభీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: