ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి.. ఇంతకంటే గొప్ప న్యూస్ ఉంటుందా?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా టీ20 టోర్ని ప్రారంభమైన ఈ లీగ్ ఇక ఇప్పుడు ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా అవతరించింది. వరల్డ్ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది అని చెప్పాలి. ఇక ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది కాబట్టి.. ఐపీఎల్లో ఆడటానికి ఎంతో మంది విదేశీ స్టార్ ప్లేయర్లు కూడా ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు. అయితే ఈ టోర్నీలో పాల్గొంటే ఒకవైపు భారీ ఆదాయం రావడంతో పాటు ఇంకోవైపు అపారమైన అనుభవం కూడా వస్తుంది అని నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి.

 ఇక మరోవైపు అంతర్జాతీయ జట్టులో స్థాన సంపాదించుకోవాలనుకున్న ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు.. ఐపీఎల్ టోర్ని  అనేది ఒక సువర్ణ అవకాశంగా మారిపోయింది. ఈ టోర్నీలో రాణించిన ఎంతోమంది ప్లేయర్లు ఇక అతి తక్కువ సమయంలోనే జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే 2024 ఐపీఎల్ సీజన్ విషయంలో గత కొంతకాలం నుంచి ఒక సందిగ్ధత నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఈ టోర్నీని భారత్లో నిర్వహిస్తారా లేదా విదేశాలకు వేదికను మారుస్తారా అనే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే ఈ టోర్నీ మార్చి నెలలో జరుగుతూ ఉండగా.. అదే సమయంలో ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి.

 ఈ క్రమంలోనే ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు భద్రతపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. తద్వారా ఇక ఈ వేదికను విదేశాలకు మార్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇక భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ పండగ లాంటి న్యూస్ చెప్పాడు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ను అటు ఇండియాలోనే నిర్వహిస్తామూ అంటూ చెప్పాడు అరుణ్ సింగ్. అయితే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన తేదీలు వచ్చిన తర్వాత ఇక ఐపీఎల్ షెడ్యూల్ ను ప్రకటిస్తాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఇక టీమ్ ఇండియా క్రికెట్ ఫాన్స్ అందరు కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: