మామ చేసిన ఆరోపణలపై.. రివాబా జడేజా ఏమన్నారో తెలుసా?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా విషయం తెరమీదకి వచ్చింది అంటే చాలు అది నిమిషాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెటర్ల ప్రొఫెషనల్ లైఫ్ కంటే అటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు అందరూ కూడా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల రవీంద్ర జడేజా కూడా ఇలాంటి ఒక పర్సనల్ మ్యాటర్ తో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు జడేజా. అయితే ఇక భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉండగా.. ఇటీవల రెండో టెస్ట్ మ్యాచ్లో గాయపడిన జడేజా జట్టుకు దూరమయ్యాడు.

 కాగా జడేజా భార్య రివాబా  ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి జోడి కూడా అటు క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించుకుంది. అయితే ఇటీవల రవీంద్ర జడేజా అతని భార్య రివాబా  పై ఏకంగా జడేజా తండ్రి సంచలన ఆరోపణలు చేశాడు అన్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత రవీంద్ర జడేజా లో ఎంతగానో మార్పు వచ్చిందని.. రివాబా  ఈ మార్పుకు కారణమైంది అంటూ చెప్పుకొచ్చాడు. రివాబా కారణంగానే ఇక తమ కుటుంబంలో చీలికలు వచ్చాయని.. ప్రస్తుతం జడేజా తమతో కలిసి ఉండడం లేదు అంటూ జడేజా తండ్రి చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.

 అయితే తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన జడేజా ఇలాంటి కామెంట్స్ బాధాకరం అంటూ అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది రవీంద్ర జడేజా భార్య రివాబా. అక్కడ ఆమెకు జడేజా తండ్రి చేసిన కామెంట్స్ పైనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె కోపంతో ఊగిపోయింది. మీ మామ చేసిన ఆరోపణలపై మీరు ఏమంటారు అంటూ ఆమెను ప్రశ్నిస్తే అసహనం వ్యక్తం చేసింది రివాబా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం. దాని గురించి మాట్లాడండి. మరో విషయం గురించి మాట్లాడాలి అంటే నన్ను నేరుగా కలవండి అంటూరి వివాహ జడేజా  ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: