ఐదెకరాల లోపే రైతుబంధు ఇస్తే.. ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు ఆదా అవుతాయో తెలుసా?

praveen
తెలంగాణ రాష్ట్రం రైతులందరికీ భరోసాగా నిలవడమే లక్ష్యంగా రైతుబంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పథకం కింద పాడి రైతులందరికీ కూడా ప్రతి ఎకరాకి ఐదువేల రూపాయల పెట్టుబడి సహాయం అందించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అని చెప్పాలి. ఇక ఇదే పథకాన్ని ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తూ వస్తుంది.

 అయితే రైతు బంధు పథకం విషయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి.  ఈ పథకం ద్వారా రైతులకు ఎంతవరకు లాభం చేకూరుతుందో తెలియదు. కానీ ఏకంగా బడాబడా భూస్వాములకు మాత్రం భారీగానే లాభం చేకూరుతుందనీ అప్పటి ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఏకంగా వందల ఎకరాల భూములు ఉన్నవారికి లక్షల రూపాయల రైతుబంధు జేబుల్లో చేరిపోతుందని.. కానీ సాదరణ రైతులకు మాత్రం పెద్దగా ఈ పథకంతో ఉపయోగం లేదు అంటూ విమర్శించాయి. ఈ క్రమంలోనే ఒకప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు విషయంలో కీలక మార్కులు చేసే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. కేవలం ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతుబంధు వర్తించేలా రూల్స్ చేంజ్ చేసే అవకాశం ఉందని ఎంతోమంది అంచనా వేస్తున్నారు.

 ఒకవేళ ప్రభుత్వం ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న వారికి మాత్రమే రైతుబంధు వర్తిస్తుంది అని చెబితే ప్రభుత్వానికి వేల కోట్లు ఆదా అవుతాయట. అయితే గత ఏడాది వానా కాలం సీజన్ లెక్కల ప్రకారం 68.9 లక్షల మందికి రైతుబంధు అందింది. అందులో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు. అంటే 90.36%. వీరి చేతిలో కోటి ఎకరాల భూమి ఉండగా ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న రైతుల సంఖ్య 6.65 లక్షలు. కానీ వీరి దగ్గర ఏకంగా 52 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఐదు ఎకరాల లోపు వారికి రైతుబంధు ఇవ్వాలి అనుకుంటే ఏడాదికి ప్రభుత్వానికి 15 వేల కోట్లు అవుతాయి. గతంతో పోల్చి చూస్తే 7000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ts

సంబంధిత వార్తలు: