పరుగుల వరద పారిస్తున్నాడు.. అయినా సెలెక్టర్లు కనకరించరేం?

praveen
భారత జట్టు లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆటగాళ్లు కేవలం కొంత మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో చటేశ్వర్ పూజారు కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. గతం లో భారత జట్టు ఏదైనా టెస్ట్ మ్యాచ్ ఆడింది అంటే చాలు ఇక అందులో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయినా చటేశ్వర్ పూజార తప్పక చోటు సంపాదించుకునేవాడు. అంతే కాదు తన ఆట తీరుతో టీమిండియా నయా వాల్ అనే గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు అని చెప్పాలి.

 అలాంటి ప్లేయర్కు ఇటీవల కాలంలో భారత జట్టులో చోటే లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. యువ ఆటగాళ్ల రాకతో ఈ సీనియర్ ప్లేయర్ ను పక్కన పెట్టేశారు సెలెక్టర్లు. అయితే పూజార అటు కౌంటి క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్లో కూడా ఆడుతూ తన ఫామ్ నిరూపించుకున్నప్పటికీ.. ఎందుకో సెలెక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు అటు రంజీ ట్రోఫీలో భాగంగా అదరగొట్టేస్తున్నాడు పూజార. పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 అయితే ఇప్పటికే ఆడిన మ్యాచ్లలో ఒక డబుల్ సెంచరీ తో పాటు రెండు హాఫ్ సెంచరీల సహాయంతో ఏకంగా 52 పరుగులు చేశాడు ఈ సీనియర్ బ్యాట్స్మెన్. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చతేశ్వర్ పూజారకు ఇది 62వ సెంచరీ కావడం గమనార్హం. అయితే ఇంగ్లాండ్ తో జరగాల్సిన చివరి మూడు టెస్టులకు జట్టులో కీలక ప్లేయర్లు దూరమైనందున ఇక టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్  పూజారకు టీమిండియాలో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది అని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: