24ఏళ్ళ రికార్డును.. బద్దలు కొట్టిన శ్రీలంక క్రికెటర్?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఎవరైనా ఆటగాడు తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించి సెంచరీ తో చలరేగిపోయాడు అంటే చాలు ఇక అతని పేరు వరల్డ్ క్రికెట్లో మారుమోగిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఏకంగా ఒక బ్యాట్స్మెన్ డబుల్ సెంచరీ చేసి వీరబాదుడు బాదితే ఇక అతనీ ఇన్నింగ్స్ పై ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి.

 నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ పొరులో శ్రీలంక జట్టు 42 పరుగుల తేడాతో ఆఫ్గనిస్తాన్ టీం పై విజయం సాధించింది  అయితే చిన్న టీం అయినప్పటికీ ఆఫ్గనిస్తాన్ మాత్రం ఏకంగా శ్రీలంకను ఓడించినంత పని చేసింది అని చెప్పాలి. దీంతో ఇక ఈ మ్యాచ్ ప్రేక్షకులందరికీ  కూడా అదిరిపోయే ఉత్కంఠను పంచింది. అయితే ఇక ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో శ్రీలంక ఓపెనర్ నిస్సంక బ్యాట్ తో  విధ్వంసం సృష్టించాడు. ఇక బౌలర్లపై విరుచుకుపడ్డాడు అని చెప్పాలి. సిక్సర్లు పోర్లతో చలరేగిపోతూ పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే డబల్ సెంచరీ చేశాడు. 139 బంతుల్లోని 20 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 210 పరుగులు చేశారు.

 ఈ క్రమంలోనే మిగతా బ్యాట్స్మెన్ అందరూ విఫలమైనప్పటికీ అతను మాత్రం జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర వహించాడ అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 381/3 పరుగులు చేసింది. అయితే శ్రీలంక తరపున వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా నిస్సాంక రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక గతంలో జయ సూర్య పేరిట అన్న అత్యధిక వ్యక్తిగత పరుగులు (184) రికార్డును అధికమంచి 24 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టేస్తాడు. ఇక అతని అద్భుతమైన ఇన్నింగ్స్ పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: