ఆరోజు అందరి ముందే.. అతనికి క్షమాపణలు చెప్పా : గంభీర్

praveen
టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా తరఫున ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ లు అడిగి ఎన్నోసార్లు అద్వితీయమైన విజయాలను అందించిన ఆటగాడు గౌతమ్ గంభీర్. ఇక భారత జట్టుకు ఓపెనర్ గా బరిలోకి దిగుతూ మంచి ఆరంభాలు అందిస్తూ ఉండేవాడు. అయితే టీమిండియా ధోని కెప్టెన్సీలో రెండు వరల్డ్ కప్ లు గెలిచింది అని మాత్రమే అందరికి తెలుసు. కానీ ఈ రెండు వరల్డ్ కప్ లు గెలవడంలో కూడా గౌతమ్ గంభీర్ కీలక పాత్ర వహించాడు.

 అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు ఐపీఎల్ టోర్నీలో కూడా ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు గౌతమ్ గంభీర్. అయితే గంభీర్ తన కెరియర్ లో క్రికెట్ ఆటతో ఎలా అయితే వార్తల్లో నిలిచేవాడో.. ఇక తన వివాదాల తోను అంతే వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయేవాడు. ఎప్పుడు అగ్ర సీవ్ గా ముక్కుసూటిగా మాట్లాడే గౌతమ్ గంభీర్  ఇక ప్రత్యర్థులతో గొడవ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఒక్కసారి ఎవరితో అయినా గొడవపడ్డాడు అంటే చాలు తన కంట్రోల్ కోల్పోయి మరి  గౌతమ్ గంభీ గొడవకు దిగడం లాంటివి ఇప్పుడు వరకు ఎన్నోసార్లు చూశామ్.


 అయితే ఇటీవలే ఒక ప్యాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంభీర్  మేకళ్లమ్ తో జరిగిన గొడవ గురించి గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2012 సీజన్ సమయంలో ఫైనల్ మ్యాచ్ కి ముందు ఫేసర్ లక్ష్మీపతి బాలాజీ గాయపడ్డారు. అతని స్థానంలో బ్రెట్ లీ ని తీసుకోవాలని అనుకున్నాం. అయితే టీంలో నలుగురు విదేశీ ప్లేయర్లను మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో అప్పటికే బాగా రాణిస్తున్న మేకళ్ళమ్ పై వేటు వేయాల్సి వచ్చింది. అయితే అతడికి అభ్యంతరంగా పక్కన పెట్టడంతో ప్లేయర్లు అందరి ముందు బ్రాండెన్ మేకల్లమ్ కి క్షమాపణలు చెప్పాను అంటూ గంభీర్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: