3 ఫార్మాట్లో నెంబర్.1 ర్యాంక్ సాధించింది.. కేవలం ఈ నలుగురేనా?

praveen
అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను గుర్తించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు ర్యాంకింగ్స్ ను ప్రకటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. క్రికెట్లో ఉన్న మూడు ఫార్మాట్లలో కూడా ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటుంది. అయితే ఐసిసి ప్రకటించే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. తాము ర్యాంకింగ్స్ ని పెద్దగా పట్టించుకోము అని పైపైకి చెబుతున్న లోలోపల మాత్రం ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలవాలి అనే కోరిక ప్రతి ఒక్క ఆటగాడికి ఉంటుంది అని చెప్పాలి.

 ఐసీసీ ప్రకటించే ర్యాంకింగ్స్ లో ఏదో ఒక ఫార్మాట్లో నెంబర్ వన్ ర్యాంకును సాధిస్తే ఇక ఆ ఆటగాడికి మాత్రమే కాదు అతని అభిమానుల ఆనందానికి కూడా అవధులు ఉండవు. ఇక ఆ నెంబర్ వన్ ర్యాంకు చాలా రోజులపాటు అలాగే పదిలంగా ఉంటే.. ఇక అభిమానులందరూ కూడా మరింత సంతోషంలో మునిగిపోతూ ఉంటారు అని చెప్పాలి. అలాంటిది ఏకంగా క్రికెట్లో ఉన్న మూడు ఫార్మట్లలో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగితే... ఇది చెప్పుకోవడానికి సింపుల్ గానే ఉన్నప్పటికీ.. ఇది జరగడం మాత్రం దాదాపు అసాధ్యం అని చెప్పాలి.

 ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది లెజెండ్స్.. ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కానీ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంది మాత్రం కేవలం నలుగురు మాత్రమే కావడం గమనార్హం. దీన్నిబట్టి ఇక ఈ మూడు ఫార్మాట్లలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవడం ఎంత కష్టమైన పనో అర్థమయ్యే ఉంటుంది. ఇటీవల టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించగా నెంబర్ స్థానాన్ని దక్కించుకున్న బుమ్రా కూడా ఈ ఘనత సాధించాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ, మాథ్యూ హెడ్, రికీ పాంటింగ్ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. అయితే బౌలర్లలో మాత్రం బుమ్రా ఒక్కడే ఈ రికార్డును అందుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: