టీమిండియాలో.. అతనొక ఛాంపియన్ ప్లేయర్ : రోహిత్

praveen
ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇరు జట్లు కూడా అటు వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ కావడంతో ఇక ఈ రెండు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లోనే ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఏకంగా ఇంగ్లాండ్ భారత జట్టుకి సొంత గడ్డమీద షాక్ ఇచ్చింది. ఏకంగామొదటి టెస్ట్ మ్యాచ్ లో ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి.
 ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇక భారత జట్టు ఇలా ప్రదర్శన చేస్తే టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం కష్టమే అంటూ ఎంతో మంది మాజీలు కూడా టీమిండియా ప్రదర్శన పై పెదవి విరిచారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా తీవ్ర విమర్శల మధ్య విశాఖ వేదికపై రెండో టెస్ట్ మ్యాచ్లో బరిలోకి దిగింది టీమిండియా. అయితే రెండో టెస్టులో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంది అని చెప్పాలి. మొదటి ఇన్నింగ్స్ తో పాటు రెండో ఇన్నింగ్స్ లో కూడా ఆకట్టుకుంది టీమిండియా. బౌలింగ్ లో కూడా సూపర్ పర్ఫామెన్స్ చేసింది అని చెప్పాలి.

 అయితే భారత జట్టు రెండో మ్యాచ్ లో విజయం సాధించడంతో ఇక జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా ప్రధాన పాత్ర పోషించాడు అని చెప్పాలి. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఏకంగా తొమ్మిది వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే బుమ్రా ప్రతిభ పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు బుమ్రా ఛాంపియన్ ప్లేయర్ అంటూ రోహిత్ ప్రశంసించాడు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్ట్ గెలవడం సులభం కాదు. సమిష్టిగా రాణించడంతో సాధ్యమైంది అంటూ చెప్పకు వచ్చాడు. యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడానికి ఇంకా సమయం ఉంది అంటూ రోహిత్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: