గిల్ సూపర్ సెంచరీ.. థాంక్స్ చెప్పిన పీటర్సన్?

praveen
గత కొంతకాలం నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా మారిపోయాడు శుభమన్ గిల్. ఇక రోహిత్ శర్మకు జోడిగా రెగ్యులర్ ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు. మూడు ఫార్మట్లలో కూడా ఇక వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ అనే గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. అలాంటి శుభమన్ గిల్ ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. అయితే తనకు ఎప్పుడూ అచొచ్చే ఓపెనర్ స్థానంలో కాకుండా వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు.

 ఈ క్రమంలోనే కొత్త బ్యాటింగ్ ఆర్డర్ లో అతను ఎలా రాణించగలడు అనే విషయంపై చర్చ జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా చెత్త ప్రదర్శనలతో నిరాశపరిచాడు గిల్. ఇక హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో విఫలమైన గిల్ విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా అలాంటి పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే గిల్ బ్యాటింగ్ పై విమర్శలు వస్తూ ఉండగా ఇక ఇటీవల రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సూపర్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. జట్టులోని కీలక బ్యాట్స్మెన్లు అందరూ కూడా విఫలమవుతున్న సమయంలో అతను మాత్రం సెంచరీ తో చెలరేగిపోయాడు.

 ఈ క్రమంలోనే ఇటీవల రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన శుభమన్ గిల్ కి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ థాంక్స్ చెప్పాడు. అదేంటి గిల్ సెంచరీ చేస్తే పీటర్సన్ థాంక్స్ చెప్పడం ఏంటి అనుకుంటున్నారు కదా.. గిల్ బ్యాటింగ్ పై విమర్శలు వస్తూ ఉంటే అతనికి పుంజుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి అంటూ మద్దతుగా నిలిచాడు పీటర్సన్. అయితే ఇక ఇప్పుడు గిల్ పీటర్సన్ నమ్మకాన్ని నిలబెడుతూ సెంచరీ చేశాడు. ఇలా తీవ్ర విమర్శలు వస్తున్న వేల గిల్ సెంచరీ తో చలరేగిపోవడంతో.. తన నమ్మకాన్ని నిజం చేశావు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ గిల్ కి థాంక్స్ చెప్పాడు పీటర్సన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: