కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది.. అతనొక్కడు మాత్రమే?

praveen
టీమ్ ఇండియా జట్టులో ప్రస్తుతం ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇందులో కొంతమంది సీనియర్ ప్లేయర్లు కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ సీనియర్ ప్లేయర్లు మహా అయితే ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత ఇక కెరియర్ కు వీడ్కోలు పలకడం ఖాయమని చెప్పాలి. అయితే ఇక ఇలా సీనియర్లుగా కొనసాగుతున్న వారి స్థానాన్ని కొత్తగా జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లు ఎవరు భర్తీ చేయగలరు అన్న విషయం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే గతంలో మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం టీమ్ ఇండియా యాజమాన్యం ఎంతగానో ప్రయత్నించింది.

 కానీ ఇప్పటికీ కూడా ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు అటు భారత జట్టుకు దొరకలేదు అని చెప్పాలి. అచ్చం ఇలాగే ఇక విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు టీమిండియాకు మళ్ళీ దొరుకుతాడా లేదా అనే విషయంపై కూడా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. అయితే ఇదే విషయంపై ఎంతోమంది మాజీ ప్లేయర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పారు అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఆలెస్టర్ కుక్.

 విరాట్ కోహ్లీ స్థానాన్ని జట్టులో భర్తీ చేసే ఆటగాడు ఒకే ఒక్కరు ఉన్నారు అంటూ అలెస్టర్ కుక్ చెప్పుకొచ్చాడు. అతను ఎవరో కాదు గిల్ మాత్రమే అంటూ అభిప్రాయపడ్డాడు. గిల్ తప్పకుండా భవిష్యత్తులో టీమిండియాలో విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తి చేస్తాడు అంటూ అలెస్టర్ కుక్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో సెంచరీ తో గిల్ చెలరేగిన సంగతి తెలిసిందే. అతను ఒక అద్భుతమైన బ్యాటర్. తన భుజాలపై చాలా ఒత్తిడి ఉంటుంది. మునుముందు విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది అతడే. ఈరోజు సెంచరీ తో ఆ విషయాన్ని మరోసారి నిరూపించాడు అంటూ అలెస్టర్ కుక్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: