మళ్లీ బ్యాట్ పట్టిన పృద్వి షా.. ముంబై జట్టులోకి వచ్చేసాడు?

praveen
భారత జట్టులో యువ సంచలనంగా పేరు సంపాదించుకున్నాడు పృద్వి షా. సముద్రపు అలల దేశవాళి క్రికెట్ నుంచి ఎంతో వేగంగా జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అయితే మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే ఎంత వేగంగా అయితే అతను టీమిండియాలోకి వచ్చాడో.. ఇక అంతే వేగంగా మళ్ళీ జట్టులో స్థానం కోల్పోయాడు అని చెప్పాలి. ఇక భారత జట్టులోకి వచ్చిన కొన్ని రోజుల పాటు బ్యాటింగ్లో మెరుపులు మెరూపించిన పృద్వి షా ఇక ఆ తర్వాత మాత్రం నిలకడలేమిటో ఇబ్బంది పడ్డాడు.

 ఈ క్రమంలోనే ఫిట్నెస్ ని కాపాడుకోవడంలో విఫలం కావడంతో అతన్ని తరచుగా గాయాల బేడత కూడా తీవ్రంగా వేధిస్తూ వచ్చింది అని చెప్పాలి. దీంతో సెలెక్టర్లు చివరికి అతని పక్కన పెట్టేశారు  అయితే ఇక పృథ్విషా భారత జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడి దాదాపు రెండేళ్లు గడిచిపోతున్నాయి. అయితే ఐపీఎల్ లో కూడా అతనికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవట్లేదు. అయితే కౌంటింగ్ క్రికెట్లో బాగా ఆడుతున్నాడు. అనుకునే లోపే మళ్ళీ గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ కు దూరంగా ఉండి బాగా లావు ఎక్కిపోయాడు పృద్వి షా.

 దీంతో ఇక అతని కెరియర్లో మళ్ళీ అవకాశాలు రావడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల టీమిండియా క్రికెటర్ పృద్వి షా రంజీ క్రికెట్లో ఛాన్స్ దక్కించుకున్నాడు. ముంబై జట్టుకు అతని సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఇటీవల కాలంలో పృద్వి షా భారీగా బరువు పెరిగిపోయి లావెక్కిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారగా మళ్లీ ఫిట్నెస్ పై దృష్టి పెట్టి రంజీలకు ఎంపికయ్యాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన కెరియర్ను నిలబెట్టుకునేందుకు తీవ్రంగానే కష్టపడబోతున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: