ఎలా ఆడాలో.. అతను ఆడి చూపించాడు : కుంబ్లే

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య టెస్టు సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు అటు ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ ప్రస్తుతం భారత క్రికెట్లో టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే  అయితే ఇటీవల హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో అదరగొట్టి భారత జట్టు విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గత 12 ఏళ్లలో ఏ ఒక్క టీం కూడా భారత జట్టును సొంత గడ్డమీద ఓడించలేకపోయింది.

 అయితే ఇంగ్లాండ్ జట్టు విషయంలో కూడా ఇదే జరుగుతుందని అందరూ అనుకున్నారు. ఎప్పటిలాగానే భారత జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘనవిజయం సాధించడం ఖాయం అని భావించారు. కానీ ఊహించని రీతిలో ఇంగ్లాండ్ జట్టు భారత్ ను సొంత గడ్డ మీదే ఓడించింది ఇంగ్లాండ్. మొదటి టెస్ట్ మ్యాచ్లో దాదాపు 20 కి పైగా పరుగులు తేడాతో భారత జట్టు ఓడిపోయింది అని చెప్పాలి. దీంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి.

 అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కాస్త తడబడినట్లు కనిపించింది ఇంగ్లాండ్ జట్టు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది. మరీ ముఖ్యంగా ఎవరు ఊహించనీ రీతిలో ఓలిపోప్ 196 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని వీరోచితమైన ఇన్నింగ్స్ పై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయ్. ఇక ఇదే విషయంపై భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  భారత గడ్డపై అత్యుత్తమ ఇన్నింగ్స్ లలో అది ఒకటి అంటూ ప్రశంసలు కురిపించాడు అనిల్ కుంబ్లే. ఒక బ్యాటర్ ఈ పిచ్ పై ఎలా ఆడాలో హోలీ పోప్ ఆడి చూపించాడు. వాస్తవానికి అతను డబుల్ సెంచరీకి అర్హుడు. అయితే బెన్ స్టోక్స్ లేదా బెయిర్ స్ట్రో ప్రమాదకరం అవుతారని భావించాం. కానీ ఓలిపోప్ అద్భుతం చేసి చూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: