రోహిత్ లో గొప్ప నటుడు ఉన్నాడే.. ఎలా ఇమిటేట్ చేసాడో చూడండి?

praveen
ప్రస్తుతం భారత జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఎంత కూల్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఒక ట్యాగ్ వచ్చింది. కానీ ఒకవేళ ధోనికి ఈ ట్యాగ్ రాకపోయి ఉంటే మాత్రం ఇక రోహిత్ శర్మకు అభిమానులు ఆ బిరుదు ఇచ్చేవారు అని చెప్పాలి. అంతలా కూల్ గా ఉంటూ అటు జట్టును ముందుకు నడిపిస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఇక ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ప్రశాంతంగా ఉంటూ.. తన వ్యూహాలతో మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం తన వైపుకు తిప్పుకుంటూ ఉంటాడు అని చెప్పాలి.

 ఎవరైనా ఆటగాడు తప్పు చేసిన అతనికి ఎంతో కూల్ గానే సూచనలు ఇస్తూ ఉంటాడు అన్న విషయం  తెలిసిందే. అయితే మైదానంలో ఎంతో కూల్ అండ్ కామ్ గా ఉండే రోహిత్ శర్మ  మైదానం బయట మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతూ ఉంటాడు. ఏకంగా కాలేజీ కుర్రాడిలా తన సహచరులపై ఎప్పుడు జోకులు వేస్తూ సరదాగా నవ్వుకుంటూ ఉంటాడు రోహిత్ శర్మ. ఇక మ్యాచ్ కి ముందు నిర్మించి ప్రెస్ మీట్ లో కూడా అటు రిపోర్టర్ల పై పంచులు వేస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటాడు. అయితే రోహిత్ శర్మ ఇటీవల భారత జట్టులోని అందరూ ఆటగాళ్ళను ఇమిటేట్ చేశాడు.

 రోహిత్ శర్మ లో కూడా ఒక గొప్ప నటుడు దాగి ఉన్నాడు అన్న విషయాన్ని నిరూపించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే టీమిండియాలోని ఆటగాళ్లు అందరిని కూడా ఇమిటేట్ చేయాలి అని యాంకర్ సరదాగా అడిగింది.. నేను సరదా సరదాకి  ఇమిటేట్ చేసేటోన్ని నువ్వు ప్రత్యేకంగా అడుగుతున్నావు.. చూసుకో మల్ల అన్నట్లుగా రోహిత్ వెంటనే ఇమిటేషన్ ప్రారంభించాడు. కోహ్లీ, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, గిల్ తోపాటు మాజీ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ లను కూడా ఇమిటేట్ చేశాడు. ధోని హెలికాప్టర్ షాట్, సచిన్ అప్పర్ కట్ షాట్, ఇక సూర్య కూడా ఎలా బ్యాటింగ్ లో షాట్లు కొడతాడు అనే విషయాన్ని చూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: