లెజెండ్ కపిల్ దేవ్ రికార్డుని.. సమం చేసిన అశ్విన్?

praveen
టీమిండియాలో సీనియర్ స్పిన్నర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. తన ఆటతీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే భారత జట్టులో ఎంతోమంది సీనియర్ ప్లేయర్లు యువ ఆటకాళ్ల రాకతో పోటీని తట్టుకోలేక ఇక జట్టులో స్థానం కోల్పోయిన వారు ఉన్నారు. కానీ అశ్విన్ మాత్రం తన స్పిన్ బౌలింగ్ తో ఎప్పటికప్పుడు కొత్తగా నిరూపించుకుంటూనే ఉన్నాడు. యువ ఆటగాళ్లను కాదని తనను ఎందుకు సెలెక్ట్ చేయాలి అన్న విషయాన్ని ఏకంగా ప్రతిసారి కూడా సెలెక్టర్లకు అర్థమయ్యేలా చేస్తూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్.

 ఈ క్రమంలోనే అతని అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకులు అందరిని కూడా ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే రవిచంద్రన్ అశ్విన్ తెలివైన స్పిన్నర్  అంటూ ఉంటారు విశ్లేషకులు. ఎందుకంటే ఏ బ్యాట్స్మెన్ కు ఎక్కడ బంతివేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు  అయితే కేవలం స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేయడమే కాదు జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్ తో కూడా ఆదుకుంటూ ఉంటాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో అరుదైన రికార్డులను బ్రేక్ చేసిన ఈ ఆటగాడు.. ఇక భారత క్రికెట్లో లెజెండ్ గా కొనసాగుతున్న కపిల్ దేవ్ పేరిట ఉన్న ఒక రికార్డును ఇటీవలే సమం చేశాడు.

 టెస్ట్ ఫార్మాట్లో ఒక బ్యాటర్ ను అత్యధిక సార్లు ఔట్ చేసిన భారత బౌలర్గా కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును అశ్విన్ సమం చేశాడు. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ నాజర్ ను కపిల్ దేవ్ ఏకంగా 12 సార్లు అవుట్ చేశాడు. అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బేన్ స్టోక్స్ ని అశ్విన్ ఇప్పటివరకు ఏకంగా 12సార్లు పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. దీంతో లెజెండ్ కపిల్ దేవ్ రికార్డుని సమం చేశాడు. కాగా ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ రికార్డును సాధించాడు అని చెప్పాలి. కాగా మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్ పై పూర్తి ఆదిపత్యం చాలా ఇస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: