బీసీసీఐ తరహాలో.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు షాకింగ్ డెసిషన్?

praveen
ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ అటు వరల్డ్ క్రికెట్ ను శాసిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి ప్రతిఏటా ఎక్కువ మొత్తంలో ఫండ్స్ వచ్చేది బీసీసీఐ నుంచే అని చెప్పాలి. దీంతో ఇక బిసిసిఐ నిర్ణయమే అటు ఐసిసి తుది నిర్ణయం గా మారిపోయింది అని ఇప్పటికే ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభివర్ణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక బిసిసిఐ క్రికెట్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంది అంటే చాలు ఇక అలాంటి నిర్ణయమే అటు అంతర్జాతీయ క్రికెట్లో కూడా అమలవుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఎన్నో దేశాల క్రికెట్ బోర్డులు ఇదే ఫాలో అవుతూ ఉన్నాయి.

 అయితే గతంలో బీసీసీఐ ఏకంగా పురుష క్రికెటర్లతో సమానంగానే మహిళా క్రికెటర్లకు కూడా వేతనాలు చెల్లించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ ను ప్రోత్సహించడమె లక్ష్యంగా ఈ సరికొత్త పోకడకు నాంది పలికింది అని చెప్పాలి. అయితే ఇక బిసిసిఐ తీసుకున్న నిర్ణయంపై అంతట ప్రశంసలు కురిపించారు. అయితే ఇక ఇప్పుడు బీసీసీఐ తరహాలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది. మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడం కోసం పురుష క్రికెటర్లతో సమానంగా మహిళ క్రికెటర్లకు ఫీజులు చెల్లించబోతుంది.

 ఈ క్రమంలోనే క్రికెట్ వెస్టిండీస్ -  వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య ఇటీవల అవగాహన ఒప్పందం జరిగింది అన్నది తెలుస్తోంది. 2027 అక్టోబర్ ఒకటవ తేదీ వరకు అందరికీ సమాన వేతనం అందించబోతుంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. కాగా ఇప్పటికే భారత్ తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ దేశాలు కూడా పురుష క్రికెటర్లతో సమానంగానే మహిళలకు కూడా సమాన వేతనాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక రానున్న రోజుల్లో మరికొన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: