టి20 వరల్డ్ కప్ లో.. రింకు సింగ్ ఉండాల్సిందే?

praveen
ప్రస్తుతం భారత జట్టులో ఎంతో మంది ప్రతిభవంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి జరగబోయే టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకోవడానికి అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఎవరికి చోటు దక్కుతుంది అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే కొంతమంది ఆటగాళ్లు t20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుంటే బాగుంటుంది అని అటు క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ప్లేయర్లలో రింకు సింగ్ కూడా ఒకరు అని చెప్పాలి.

 అతనికి రోజురోజుకీ మద్దతు పెరిగిపోతూనే ఉంది. రింగు సింగ్ బ్యాటింగ్ విధ్వంసం చూసిన తర్వాత అతడు లేకుండా టి20 వరల్డ్ కప్ టీం ని అసలు ఊహించుకోలేము అంటూ ఎంతో మంది భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో రింకు తన బ్యాటింగ్ తో ఎలాంటి విద్వంశం సృష్టించాడో చూసాము. ఇక మూడో టి20 మ్యాచ్ లో అయితే రోహిత్ శర్మతో కలిసి 190 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఒకవైపు రోహిత్ సెంచరీ తో చేలరేగితే మరోవైపు రింకు సిక్సర్లు ఫోర్లతో చెడుగుడు ఆడేసాడు.

 ఈ క్రమంలోనే రింకు సింగ్ తప్పకుండా టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టులో ఉండాల్సిందే అంటూ ఎంతో మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి డిమాండ్ చేయడానికి అతను సాధించిన గణాంకాలే కారణం. ఇప్పుడు వరకు రింకు సింగ్ 11 t20 లలో 89 సగటుతో 356 పరుగులు చేశాడు. 176 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడంతో పాటు ఏకంగా 20 సిక్సర్లు బాదాడు. ఇలా 11 t20 లో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్ కి అవుట్ అయ్యాడు. జట్టు ఒత్తిడిలో ఉన్న ప్రతిసారి కూడా రాణిస్తూ ఫ్యూచర్ యువరాజ్ సింగ్ అనే పేరును కూడా సంపాదించుకుంటున్నాడు రింకు సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: