టి20 ఫార్మాట్ లో.. రోహిత్ సాధించిన అద్భుత రికార్డులు ఇవే?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మార్మోగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇటీవల సూపర్ సెంచరీ తో రోహిత్ చెలరేగిపోయాడు. ఒకవైపు సహచరులు అందరూ కూడా తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోతున్న సమయంలో కూడా రోహిత్ ఎక్కడ తడబాటుకు గురి కాలేదు. తనకు ఉన్న అనుభవాన్ని మొత్తం ఉపయోగించి జట్టుకు భారీ స్కోరు అందించడానికి ఎంతో దూకుడుగా ఆడాడు. 63 బంతుల్లోనే ఏకంగా 121 పరుగులు చేసి అదరగొట్టాడు రోహిత్ శర్మ.

 అయితే ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తో భారత జట్టుకు విజయాన్ని అందించడం అంతేకాకుండా ఉత్కంటభరితంగా జరిగిన మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లు జరగగా.. ఈ సూపర్ ఓవర్లలో కూడా 13, 11 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే ఇక రోహిత్ శర్మ ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవలే మూడో టి20 మ్యాచ్ విజయం ద్వారా రోహిత్ ఎలాంటి రికార్డులను సాధించాడు. ఒకసారి వివరాలు చూసుకుంటే..
 టి20 ఫార్మాట్లో భారత్ కెప్టెన్ గా అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ధోని రికార్డును బద్దలు కొట్టాడు.
 అంతేకాకుండా టీ20 ఫార్మాట్లో ప్రపంచ క్రికెట్లో అత్యధిక సెంచరీలు 5 సాధించిన ప్లేయర్గా నిలిచాడు.

 టి20 ఫార్మాట్ లో భారత్ కెప్టెన్ గా అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్గా నిలిచాడు.
 ఇక భారత కెప్టెన్గా t20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు 1648 చేసిన ప్లేయర్గా నిలిచి.. కోహ్లీని వెనక్కి నేట్టాడు.

 ఇక టీమిండియా సారధిగా అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 6 అవార్డులు అందుకున్న ప్లేయర్గా కొనసాగుతున్నాడు.

 భారత జట్టు కెప్టెన్ గా అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన ఆటగాడుగా నిలిచాడు.
 ఇక అత్యధిక ద్వైపాక్షిక సిరీస్ లు (12) గెలిచిన ప్లేయర్ గా కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: