కోహ్లీ డకౌట్ పై.. రోహిత్ కీలక వ్యాఖ్యలు?

praveen
ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో టీమ్ ఇండియా గెలిచిన మూడో టి20 మ్యాచ్ గురించి ప్రస్తుతం భారత క్రికెట్ లో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 212 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ ఇంత భారీ టార్గెట్ ను చేదించలేదు అని అందరూ అనుకున్నారు. కానీ ఇక ఉత్కంఠ భరితంగా జరిగిన పోరు చివరికి డ్రాగ ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే సూపర్ ఓవర్ కూడా డ్రాగా ముగియడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠ గా మారింది.  దీంతో రెండో సూపర్ ఓవర్ సరిగా ఇక సూపర్ ఓవర్ లో అటు టీమ్ ఇండియా విజేతగా నిలిచింది అని చెప్పాలి.

 అయితే ఇక ఈ మ్యాచ్ లో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేసి సూపర్ సెంచరీ తో చలరేగిపోయాడు. అయితే మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రం గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు అని చెప్పాలి. మొదటి బంతికే స్వీప్ షాట్ ఆడెందుకు ప్రయత్నించి చివరికి వికెట్ సమర్పించుకున్నాడు. సాధారణంగా విరాట్ కోహ్లీ డక్ అవుట్ అవ్వడం చాలా అరుదు. అయితే కోహ్లీ డక్ అవుట్ అయిన తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. సీనియర్  కోహ్లీ ఇన్నింగ్స్ ను నిర్మించాల్సింది పోయి పేలవ షాట్ ఆడి అవుట్ అవడం ఏంటి అని ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు.

 అయితే విరాట్ కోహ్లీ డక్ అవుట్ అయ్యాడు ఉన్న ఒక కారణం తప్ప ఇక ఫీల్డింగ్లో అతను మెరుపులు మెరూపించాడు అని చెప్పాలి. అద్భుతమైన ఫీల్డింగ్  విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ డక్ అవుట్ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ డకౌట్ అయినప్పటికీ కూడా కెప్టెన్ రోహిత్ అతని వెనకేసుకొచ్చాడు. సహజంగా విరాట్ కోహ్లీ తొలి బంతికే ఇలాంటి షాట్ ఆడడని..  కానీ కోహ్లీ ఉద్దేశం నాకు అర్థమైంది. జట్టు కోసం మొదటి బంతి నుంచి అటాకింగ్ గేమ్ ఆడాలని అనుకున్నాడు రోహిత్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: