అయోధ్య నుండి ఆహ్వానం.. అప్పుడే టెస్ట్ సిరీస్ కోసం ప్రాక్టీస్.. కోహ్లీ ఏం చేయబోతున్నాడంటే?

praveen
ప్రస్తుతం భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియా పర్యటనకు వచ్చిన ఆప్కానిస్తాన్ తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ను ముగించుకుంది. అయితే ఇక ఈ టి20 సిరీస్ లో మూడు మ్యాచ్లలో కూడా విజయం సాధించి ఆఫ్ఘనిస్తాన్ ను క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పాలి. అయితే ఇటీవల జరిగిన మూడో టి20 మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరిగింది. ఇక ప్రేక్షకులు టి20 ఫార్మాట్లో ఎలాంటి ఉత్కంఠ అయితే కావాలని కోరుకుంటారో.. ఇకమూడో మ్యాచ్లో అలాంటి ఉత్కంఠ ప్రేక్షకులకు దక్కింది.

 ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా భారీ పరుగులు చేయగా.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా రెచ్చిపోయి బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత రెండు సూపర్ ఓవర్లు ఆడించగా.. చివరికి ఇండియా విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే ఈనెల 25వ తేదీ నుంచి కూడా ఇండియా పర్యటనకు రాబోతున్న ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతుంది టీమిండియా. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ముందుకు దూసుకు వెళ్లడానికి ఈ టెస్ట్ సిరీస్ టీమ్ ఇండియాకు ఎంతో కీలకం అని చెప్పాలి.

 ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల 25వ తేదీన హైదరాబాద్ చేరుకోబోతుంది టీమిండియా. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు ఉప్పల్ స్టేడియంలో దాదాపు నాలుగు రోజులపాటు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనబోతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రాక్టీస్ సెషన్లో భాగంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్యలోనే టీమ్ ఇండియాను వీడబోతున్నాడు. ఎందుకంటే ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొనాలని కోహ్లీ దంపతులకు ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే బీసీసీఐని ఇదే విషయంపై పర్మిషన్ అడగగా.. సానుకూలంగా స్పందించిందట. దీంతో ఒక రోజు ప్రాక్టీస్ తర్వాత మళ్ళీ అయోధ్య వెళ్లి తర్వాత రోజు ప్రాక్టీస్ లో పాల్గొనబోతున్నాడట కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Koi

సంబంధిత వార్తలు: