వావ్.. కెప్టెన్ గా కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్?

praveen
ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. ఇక అతని సారథ్యంలో టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. ఇక రోహిత్ శర్మ తన కెప్టెన్సీ వ్యూహాలతో  మాజీ ప్లేయర్లను సైతం ఫిదా చేసేస్తూ ఉన్నాడు. అయితే అంతకుముందు ఇక టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. ఇక అనూహ్య పరిస్థితుల మధ్య కోహ్లీ చేతి నుంచి రోహిత్  కు కెప్టెన్సీ బాధ్యతలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా కెప్టెన్సీ మార్పు తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ ఎన్నో వార్తలు తెరమీదకి వచ్చాయి. కానీ ఆ తర్వాత కాలంలో ఇవన్నీ కేవలం వట్టి పుకార్లు మాత్రమే అన్న విషయం జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి అర్థమైంది. అది సరేగాని ఇప్పుడు కోహ్లీ, రోహిత్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జరిగిన మూడో టి20 మ్యాచ్లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు. టాప్ ఆర్డర్ మొత్తం చేతులెత్తేసిన సమయంలో ఓపెనర్ గా బలిలోకి దిగిన రోహిత్.. చివరి వరకు బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ సాధించిన సెంచరీతో ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేశాడు అని చెప్పాలి.

 భారత కెప్టెన్గా t20 ఫార్మాట్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇక టీమిండియా కెప్టెన్ గా టి20 ఫార్మాట్లో 1570 పరుగులు సాధించాడు. ఇటీవల సాధించిన సెంచరీ తో రోహిత్ శర్మ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. భారత కెప్టెన్ గా టి20 ఫార్మాట్ లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా అవతరించాడు. ఇటీవల సాధించిన సెంచరీ తో రోహిత్ శర్మ టి20 ఫార్మాట్లో కెప్టెన్ గా 1572 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ 1570 పరుగుల రికార్డును బద్దలు కొట్టేసాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: