జట్టులో చోటే లేదు.. కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి సామీ?

praveen
గత కొంతకాలం నుంచి భారత జట్టులో యువ ఆటగల్ళ హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా భారత జట్టులో ఛాన్స్ దక్కించుకుంటున్న యంగ్ ప్రేయర్ తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒకప్పుడు భారత జట్టులో స్టార్ ప్లేయర్లుగా హవా నడిపించినసీనియర్ల స్థానం గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఒకటి రెండు మ్యాచ్లలో సీనియర్లు పెద్దగా రాణించలేదు అంటే చాలు ఇక సెలెక్టర్లు నిర్మొహమాటంగా వారిని పక్కన పెట్టడం లాంటిది చేస్తూ ఉన్నారు. దీంతో ఇలాంటి పరిస్థితుల మధ్య ఎంతో మంది సీనియర్ ప్లేయర్ల చోటు జట్టులో గల్లంతయింది. అలాంటి వారిలో ఒకప్పుడు టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీకి డిప్యూటీగా జట్టుకు సేవలందించిన అజీంక్యా రహానే కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. కోహ్లీ రెస్ట్ తీసుకున్నప్పుడల్లా అజింక్య రహానే టెస్ట్ కెప్టెన్సీ చేపట్టి జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. తన బ్యాటింగ్ తో కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు.

 ఇలా ఒకప్పుడు భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగిన అజీంక్యా రహానేకు ప్రస్తుతం టీమిండియాలో చోటే లేకుండా పోయింది అని చెప్పాలి. దేశవాలి టోర్నీలలో బాగా రాణిస్తున్నప్పటికీ సెలెక్టర్లు మాత్రం ఈ సీనియర్ ప్లేయర్ని ప్రకటించుకోవట్లేదు. అయితే ఇక ఇంగ్లాండ్తో ఈనెల 25వ తేదీ నుంచి జరగబోయే టెస్ట్ సిరీస్ లో అతనికి చోటు దక్కుతుంది అనుకున్నప్పటికీ మళ్లీ నిరాశ ఎదురయింది. కాగా ఇటీవల రహనే  తన కెరీయర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  టీమిండియాలో మళ్ళీ చోటు దక్కించుకుంటాను అంటూ తీమా వ్యక్తం చేసాడు. ప్రస్తుతం రంజి ట్రోఫీలో ముంబై కెప్టెన్గా వ్యవహరిస్తున్న రహానే మాట్లాడుతూ ఈ సీజన్ ను గొప్పగా ప్రారంభించాం. ఒక్కో మ్యాచ్ ఫై దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నాం. రంజి ట్రోఫీ గెలవడంతో పాటు టీమిండియా  తరఫున 100 టెస్ట్ లు ఆడటమే నా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు రహానే. కాగా ఇప్పటివరకు రహనే 85 టెస్ట్ లు ఆడాడు. అయితే ప్రస్తుతం టీమిండియాలో చోటు కోల్పోయిన అతనికి ఇంత కాన్ఫిడెన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: