నా బయోపిక్ లో.. ఆ స్టార్ హీరో నటిస్తే బాగుండు : యువరాజ్

praveen
ఇటీవల కాలంలో  సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా బయోపిక్ల హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది సీని రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథ ఆధారంగా బయోపిక్ సినిమాలను తీయడానికి అటు దర్శకనిర్మాతలు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేకపోవడం.. ఇక సెలబ్రిటీల బయోపిక్ కావడంతో ప్రమోషన్స్ చేయకుండానే ఇక ఆ మూవీకి మంచి బజ్ ఏర్పడుతూ ఉండడంతో.. ఇక ఇలాంటి సినిమాల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరిస్తున్నారు దర్శకనిర్మాతలు.

 ఇక ఇప్పటికే ఎంతోమంది క్రీడారంగానికి చెందిన ప్రముఖులకు సంబంధించిన బయోపిక్ సినిమాలు వచ్చాయి. కొన్ని విజయం సాధిస్తే మరికొన్ని నిరాశపరిచాయి అన్న విషయం తెలిసిందే. సచిన్, ధోని, ప్రవీణ్ తాంబే, కపిల్ దేవ్ ఇలా ఎంతోమంది మాజీ క్రికెటర్ల బయోపిక్ లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా సౌరబ్ గంగూలీ బయోపిక్ కూడా తెరకెక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇక మాజీ క్రికెటర్లు ఎక్కడికి వెళ్లినా వారికి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి  అని చెప్పాలి. ఇటీవల ఒక భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కి కూడా ఇలాంటి ప్రశ్న ఎదురయింది.

 ఒకవేళ మీ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీస్తే అందులో మీ పాత్రలో ఏ హీరో అయితే బాగుంటాడు అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు యువరాజ్. ఒకవేళ నా బయోపిక్ తీస్తే అందులో తన పాత్రకు రణబీర్ కపూర్ సరిగ్గా సరిపోతాడు అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ నటన తనను ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పుకొచ్చాడు. అయితే అంతిమంగా ఇది అటు డైరెక్టర్ ఎంపికపై ఆధారపడి ఉంటుంది అంటూ తెలిపాడు. అయితే తన బయోపిక్ తప్పకుండా వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: