చిత్తుగా ఓడిపోయాక కేసీఆర్‌కు జనం గుర్తుకొచ్చారా?

Chakravarthi Kalyan
మాజీ సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలే గుర్తు రాలేదని.. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత ప్రజలు గుర్తొచ్చారా అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రశ్నించారు. నిజాన్ని అబద్ధాలుగా ఏవిధంగా మాట్లాడటం మాజీ సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని జగ్గారెడ్డి అభివర్ణించారు.  మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఇంట్లో భోజనం చేసేటప్పుడు విద్యుత్తు పోయిందంటే ఎవ్వరు నమ్మరని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కావాలనే అబద్దాలతో కాలయాపన చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రజలే మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ చేశారని జగ్గారెడ్డిఎద్దేవా చేశారు.

అందుకే ఇప్పుడు గత్యంతరం లేక కెసిఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్న జగ్గారెడ్డి..  ఈ పది సంవత్సరాల పాలనలో కెసిఆర్ ఎప్పుడైనా సచివాలయంలో ప్రజలకి అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు. పది సంవత్సరాలు సీఎంగా ఉన్నపుడు కేసీఆర్‌కు సోషల్ మీడియా లేదు.. ప్రతిపక్షంలోకి రాగానే వచ్చిందా అని జగ్గారెడ్డి నిలదీశారు. తెలంగాణ లో కాంగ్రెస్ 14 పార్లమెంట్ సీట్లు వస్తాయని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జగ్గారెడ్డి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: