ఆ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణమదే..??

Suma Kallamadi
మే 13వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వేళ రాష్ట్రమంతటా అనేక గొడవలు జరిగాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రక్తపుటేరులు పారేలాగా టీడీపీ నేతలు పోలింగ్ ఏజెంట్లపై, వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. కర్రలతో దాడులు రాళ్లు విసరడం చేస్తూ ప్రజలకు, ప్రజల ప్రాపర్టీకి నష్టం కలిగించారు. పోలింగ్ తేదీన మొదలైన ఈ గొడవలు ఇప్పటికీ చల్లారలేదు. ఓట్ల రోజు అనంతరం కూడా పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతున్నాయి. భీతవాహ వాతావరణం నెలకొన్న పల్నాడు జిల్లాలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ముందు జాగ్రత్తతో పెద్ద ఎత్తున బలగాలు మోహరించి బందోబస్తును ఏర్పాటు చేశారు.
 కారంపూడి, కొత్త గణేశుని పాడు ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి కాబట్టి అక్కడ కూడా బలగాలను రంగంలోకి దింపారు. మాచర్ల గురజాడ నరసారావు పేట నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం 19 కంపెనీలకు చెందిన బలగాలు గస్తీ కాస్తున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవి ఇద్దరూ కూడా మాచర్ల నియోజకవర్గం లోనే ఉండి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. మాచర్ల పట్టణంలో అడుగడుగునా పోలీసులు ఉన్నారు. టౌన్‌లోకి ప్రవేశిస్తున్న ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు.
పోలీసులు ఈ గొడవల నేపథ్యంలో ఒక కీలకమైన స్టెప్ కూడా తీసుకున్నారు. వైసీపీకి చెందిన ముగ్గురు ముఖ్యమైన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గురజాలలో కాసు మహేశ్‌రెడ్డి, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గృహనిర్బంధం చేశారు. పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డిని కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 144 సెక్షన్‌ అమలులో ఉంది కాబట్టి పల్నాడు జిల్లాలో ఎక్కడా కూడా ఎక్కువమంది గుమిగూడవద్దని ఎస్పీ బిందుమాధవ్‌ ఒక వార్నింగ్‌ జారీ చేశారు. ముగ్గురి కంటే ఎక్కువగా కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. సామాన్యులకు ఎలాంటి ఆటంకాలు తాము కలిగించబోమని కానీ ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారు వారిపై కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: