డబుల్ ఇస్మార్ట్: రామ్ కి పాన్ ఇండియా హిట్ పక్కా?

Purushottham Vinay
రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. నేడు రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చెప్పినట్లుగానే డబుల్ ఇస్మార్ట్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రామ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ బుధవారం ఉదయం ఈ టీజర్ ని విడుదల చేశారు. రామ్ మార్క్ డైలాగ్ తో ఈ సినిమా టీజర్ స్టార్ట్ అయింది. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ అంటూ రామ్ ను చాలా ఇంట్రెస్ట్ గా ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్.'నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులో కాలుతాది' అంటూ రామ్ తెలంగాణ యాసలో తన డైలాగులతో ఎంతో అలరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఊర మాస్ రోల్ లో అదరగొట్టారు. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలనిజం కూడా హైలెట్ గా నిలిచింది. ఇంకా హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ డోస్ బాగానే ఉంది.అన్నిటికంటే టీజర్ లో శివుడి సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఆ పాటలో కొన్ని వేల మంది కనిపించేటట్లు ఉన్నారు. నుదిటిన విభూదితో రామ్ అందులో డివోషనల్ గా కనిపించారు. దీంతో ఈ మూవీ క్లైమాక్స్ కూడా శివుని రిఫరెన్స్ తో ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. హిందూ దేవుళ్ళ రిఫరెన్స్ ఇప్పుడు తాజా ట్రెండ్.


ఈ ట్రెండ్ ఇప్పుడు బాలీవుడ్ లో నడుస్తుంది. వర్క్ అవుట్ అయితే భారీ హిట్టు పక్కా. పైగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో రామ్ కూడా యూ ట్యూబ్ హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీ వాళ్లకి దగ్గర కావడంతో ఖచ్చితంగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ కొట్టేలా ఉంది. పైగా పూరి జగన్నాథ్ లైగర్ ఫెయిల్యూర్స్ నుంచి చాలా నేర్చుకొని ఈ సినిమాని జాగ్రత్తగా తన వింటేజ్ స్టైల్ లో తీసినట్లు కనిపిస్తుంది. మధ్యలో అలీ కామెడీ కూడా పూరి జగన్నాథ్ వింటేజ్ మార్క్ ని క్రియేట్ చేసేలా ఉంది.మణి శర్మ మ్యూజిక్ కూడా అదిరింది.ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా 100 నుంచి 150 కోట్లు వసూళ్లు చేసే ఛాన్స్ ఉంది.మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ టీజర్.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంది. ఈసారి కూడా రామ్ డబుల్ ఇస్మార్ట్ అంటూ హిట్ కొట్టబోతున్నారని టీజర్ చూస్తుంటేనే  తెలుస్తుంది. అయితే ఈ మూవీని 2024 మార్చిలో రిలీజ్ చేయాలని ముందు పూరి జగన్నాథ్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఈరోజు రిలీజ్ చేసిన టీజర్ తో కొత్త డేట్ అనౌన్స్ చేస్తారని అంతా భావించారు.కానీ మేకర్స్  ఎలాంటి ప్రకటనని ఇవ్వలేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: