ఓరి నాయనో.. ఇతను మనిషా రోబోనా.. ఒక్కడే 400 పరుగులు చేశాడు?

praveen
భారత క్రికెట్ లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది యంగ్ క్రికెటర్ అదిరిపోయే ప్రదర్శనలు చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు. అంతేకాకుండా ఇక భారత జట్టుకు భవిష్యత్తు స్టార్స్ తామే అంటూ ఎంతోమంది తమ ఆట తీరుతో నిరూపించుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక కొంతమంది ఐపీఎల్ లాంటి టోర్నీలో అదరగొడుతూ ఉంటే ఇంకొంతమంది ఐపీఎల్లో ఛాన్స్ దక్కకపోయినా పెద్దగా నిరాశ చెందకుండా.. దేశవాళి టోర్నీలలో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు.

 అయితే క్రికెట్లో ఎవరైనా ప్లేయర్ డబుల్ సెంచరీ చేశాడు అంటే చాలు ఇక అతన్ని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇక అలాంటిది ఎవరైనా త్రిబుల్ సెంచరీ చేస్తే వామ్మో ఇలాంటి ఆటగాడిని ఇప్పటివరకు చూడలేదు. ఈ కుర్రాడు రాబోయే రోజుల్లో వరల్డ్ క్రికెట్లో హవా నడిపిస్తాడు అంటూ ఎంతో మంది మాజీ ప్లేయర్లు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అలాంటిది ఏకంగా ఒక ఆటగాడు 400 పరుగులు చేస్తే..  400 పరుగుల అలా ఎవరైనా చేస్తారా.. ఆ రేంజ్ లో పరుగులు చేశాడంటే అతను తోపేఅంటారు అందరు.  ఇక్కడ ఒక క్రికెటర్ ఇలాంటి రికార్డును సాధించాడు.

 కర్ణాటక క్రికెటర్ ప్రకార్ చతుర్వేది ఏకంగా అరుదైన రికార్డు సృష్టించాడు. కూచ్ బెహర్ ట్రోఫీ ఫైనల్లో ఏకంగా ఒక్కడే 400 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఈ ట్రోఫీలో 400 పరుగులు చేసిన తొలి ప్లేయర్గా రికార్డర్ సృష్టించాడు. ముంబై తో జరుగుతున్న మ్యాచ్లో 638 బంతుల్లో 404 పరుగులు చేశాడు ఫ్రకర్. ఇందులో 46 ఫోరులు ఆరు సిక్సర్లు ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇతను బ్యాటింగ్ విధ్వంసంతో కర్ణాటక జట్టు 890/8 రన్స్ వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. 380 పరుగులకు ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: