ఈ స్టన్నింగ్ క్యాచ్ చూస్తే.. పక్షి కూడా ఆశ్చర్యపోతుందేమో?

praveen
ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రేట్ క్యాచ్ లను అందుకోవడం చాలా అరుదుగా చూసే వాళ్ళం. కానీ ఇటీవల కాలంలో టి20 ఫార్మాట్ ఇక ప్రపంచ క్రికెట్లో హవా నడిపిస్తున్న సమయంలో.. ప్రతి మ్యాచ్ లో కూడా ఇలాంటి క్యాచ్ ఒకటి కనిపిస్తుంది. ఇక ఇలాంటి అద్భుతమైన క్యాచ్ లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లు ఫీల్డింగ్  ప్రమాణాలు కూడా పెరిగిపోయిన నేపథ్యంలో.. అంతకుమించి అనే రేంజ్ లోనే కొన్ని కొన్ని స్టన్నింగ్ క్యాచ్ లను టి20 మ్యాచ్లలో చూడగలుగుతున్నారు ప్రేక్షకులు.

 ఇటీవల కాలంలో వరల్డ్ క్రికెట్లో ఉన్న పోటీని తట్టుకునేందుకు బ్యాటింగ్ బౌలింగ్ మీదే కాదు ఇక ఫీల్డింగ్ మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు ఎంతోమంది ఆటగాళ్లు అని చెప్పాలి. అయితే ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ ని ఎవరైనా ఆటగాడు పట్టాడు అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోతూ ఉంటుంది. కాగా బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఇటీవల పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

 వెల్డింగ్టన్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ల మధ్య ఇటీవల బేసిన్ రిజర్వ్ లో జరిగిన మ్యాచ్ లో ఒక అసాధారణమైన క్యాచ్ నమోదయింది. బౌలర్ వేసిన 6 ఓవర్లో బ్యాటర్ యాంగ్ లాంగిఇన్ దిశగా షాట్ ఆడాడు  గాల్లోకి లేచిన బంతిని క్యాచ్ అందుకునే క్రమంలో  జాన్సన్ వేగంగా రన్నింగ్ చేసుకుంటూ బౌండరీ వద్దకు వెళ్లాడు  అయితే అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే బౌండరీ రోప్ తగులుతుందని ముందుగానే గ్రహించి రెప్పపాటు కాలంలో వెంటనే బంతిని మరో ఫీల్డర్ కి విసరగా.. అతను క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాట్స్మెన్ ఈ అద్భుతమైన క్యాచ్తో ఆశ్చర్యపోయి.. నిరాశతో మైదానాన్ని వీడాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: