కోహ్లీ కోసం.. ఆ తెలుగు క్రికెటర్ త్యాగం చేయాల్సిందేనా?

praveen
ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు. అయితే గత కొన్ని నెలల నుంచి ఇద్దరు కూడా టి20 ఫార్మాట్ కు పూర్తిగా దూరంగా ఉన్నారు అన్న విషయం తెలిసిందదే. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్ని నీ దృష్టిలో పెట్టుకొని ఇక పొట్టి ఫార్మాట్కు దూరమయ్యారు ఇద్దరు సీనియర్లు. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో  దాదాపు 14 నెలల తర్వాత మళ్లీ పొట్టి ఫార్మాట్లో మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమయ్యారు  ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో ఆడుతూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మొదటి టి20 మ్యాచ్ లో జట్టుకు దూరంగానే ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇక అతను జట్టుకు దూరమయ్యాడు అనే విషయం తెలిసిందే  ఇక రోహిత్ శర్మ మాత్రం మొదటి టి20 మ్యాచ్ ఆడాడు. అయితే రెండో మ్యాచ్లో కోహ్లీ మళ్లీ జట్టులోకి వస్తాడు  అయితే కోహ్లీ జట్టులోకి వస్తే ఇక ఎవరో ఒక యువ ఆటగాడి పై వేటు వేయక తప్పదు. దీంతో ఆ యువ ఆటగాడు ఎవరు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాడు.

 కాగా నేడు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇండోర్ వేదికగా రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. వ్యక్తిగత కారణాలతో తొలి టీ20 కి దూరమై తిరిగి జట్టులోకి రాగా అతను ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే కోహ్లీ రావడంతో చివరికి తెలుగు క్రికెట్ పైన వేటుపడే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం జట్టులో మూడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తున్న తిలక్ వర్మను జట్టు నుంచి పక్కకి పెట్టి కోహ్లీనీ జట్టులోకి తీసుకొనే చాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. ఇక మరోవైపు తొడ కండరాల నొప్పితో తొలి మ్యాచ్కు దూరంగా ఉన్న జైశ్వాల్ ఇక రెండో మ్యాచ్లో గిల్ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: