9 ఓవర్లు, 4 వికెట్లు, 53 డాట్ బాల్స్.. వారెవ్వా ఏం బౌలింగ్ చేశాడబ్బా?

praveen
భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో తెరమీదకి వస్తూనే ఉన్నారు. ఒక్కసారిగా భారత సెలక్టర్ల చూపును ఆకర్షిస్తూ ఇక టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్స్ గా నిలుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా గత కొంతకాలం నుంచి టీమిండియా ఆడుతున్న ప్రతి సిరీస్ లో కూడా ఎవరో ఒకరు కొత్త ఆటగాడు జట్టులోకి అరంగేట్రం చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా భారత జట్టులోకి వచ్చిన ఎంతో మంది యువ ఆటగాళ్లు ఎక్కడ ఒత్తిడికి లోను కాకుండా తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉన్నారు.

 అయితే కొంతమంది యంగ్ ప్లేయర్స్ ఐపీఎల్ లాంటి టోర్నీలలో మెరుస్తూ ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతుంటే.. ఇంకొంతమంది ప్లేయర్లు ప్రతిష్టాత్మకమైన దేశవాళి టోర్నీ రంజీ ట్రోఫీ లాంటి టోర్నీలలో అదరగొడుతున్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం రంజీ ట్రోఫీ జరుగుతూ ఆయా మ్యాచ్లలో మంచి ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్ల పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఇక ఇటీవల దేశవాలి టోర్నిలో విదర్బ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తన స్పిన్ తో మ్యాజిక్ చేసి చూపించాడు. ఏకంగా తొమ్మిది ఓవర్లు వేసి 53 డాట్ బాల్స్ వేయడం గమనార్హం.

 ఈ క్రమంలోనే అతని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. విదర్బా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఆదిత్య సర్వటే ఇటీవల జరిగిన మ్యాచ్లో అదరగొట్టాడు. గుజరాత్ లో జరిగిన టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 9 ఓవర్లు వేసిన ఆదిత్య ఏకంగా 53 డాట్ బాల్స్ వేసాడు. అంతేకాదు నాలుగు వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో ఇక ప్రత్యర్థి మణిపూర్ జట్టు 75 పరుగులకే చాప చుట్టేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 11 ఓవర్లు వేసిన ఆదిత్య పది పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో మణిపూర్ రెండో ఇన్నింగ్స్ లో 65 పరుగులకే పరిమితమైంది. ఈ క్రమంలోనే విదర్భ జట్టు 90 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: