రోహిత్ శర్మకు అవమానం.. ముంబై ఇండియన్స్ ఇలా చేసిందేంటి?

praveen
ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. మూడు ఫార్మాట్లకు సారధిగా ఉంటూ సూపర్ సక్సెస్ అవుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక భారత జట్టును మూడు సార్లు కూడా నెంబర్ వన్ స్థానంలో నిలపడంలో రోహిత్ సక్సెస్ అయ్యాడు. అయితే ప్రస్తుతం భారత కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అవుతున్న రోహిత్ శర్మకు ఇటీవల ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఊహించిన షాక్ ఇచ్చింది. ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ ను.. సారధ్య బాధ్యతల నుంచి తప్పించింది ముంబై ఇండియన్స్.

 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ అభిమానులందరూ కూడా ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ ను ఇలా అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించి అతనికి ఏం గౌరవం ఇచ్చారు అంటూ రోహిత్ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అయితే మొన్నటికి మొన్న రోహిత్ శర్మను అటు కెప్టెన్సీ నుంచి తప్పించి అగౌరపరిచిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ  ఇక ఇటీవల  మరోసారి రోహిత్ శర్మను అవమానించింది.

 ఈనెల 25వ తేదీ నుంచి అటు ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతుంది టీమిండియా. అయితే ఇదే విషయంపై అటు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒక పోస్టర్ను విడుదల చేసింది. ఇక ముంబై ఇండియన్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం వివాదానికి కారణమైంది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే ముంబై జట్టు యాజమాన్యం పోస్ట్ చేసిన పోస్టర్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కడ కనిపించడం లేదు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, బుమ్రా ఫోటోలను పోస్టర్ లో చూపించింది. కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఫోటో మాత్రం పెట్టలేదు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం రోహిత్ శర్మను అవమానించింది అంటూ హిట్ మాన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: