అతను.. కెప్టెన్ రోహిత్ ను నమ్మి ఉంటే బాగుండేది?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ చాలా రోజుల తర్వాత మళ్లీ టి20 ఫార్మాట్లోకి అడుగు పెట్టాడు అన్న విషయం తెలిసిందే. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు పూర్తిగా దూరంగానే ఉన్నాడు రోహిత్ శర్మ. అయితే వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇక బీసీసీఐ రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీని కూడా t20 ఫార్మాట్ కు దూరంగా ఉంచింది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కి ముందు టీమిండియా ఆడబోయే ఏకైక టీ20 మ్యాచ్ లో అటు కెప్టెన్ రోహిత్ శర్మను భాగం చేసింది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో రోహిత్ శర్మ ఆడుతూ ఉన్నాడు. అయితే 14 నెలల గ్యాప్ తర్వాత రోహిత్ శర్మ టి20 మ్యాచ్ ఆడుతూ ఉండడంతో అతని ప్రదర్శన పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఊహించనీ రీతిలో పరుగుల ఖాతా తెరవకుండానే రన్ అవుట్ రూపంలో డక్ అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. అయితే గిల్ కారణంగానే రోహిత్ డకౌట్ అయ్యాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ పై గిల్ నమ్మకం ఉంచాల్సిందే.. అంతర్జాతీయ టి20 లలో వాళ్ళిద్దరూ కలిసి ఓపెనింగ్ చేయడం ఇదే తొలిసారి అని తెలుసు. కానీ వన్డేలు, టెస్టుల్లో వారిద్దరు ఇప్పటికే ఎన్నో మ్యాచ్లలో ఓపెనింగ్ చేశారు. గిల్ బంతిని చూస్తూ ఉండడం వల్ల సమన్వయ లోపం చోటుచేసుకుంది. అలా చేసే బదులు రోహిత్ పిలవగానే పరిగెత్తుకుని వస్తే బాగుండేది. అప్పుడు రోహిత్ రన్ అవుట్ అయ్యేవాడు కాదు అంటూ భారత మాజీ ఆటగాడు పార్దివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: