బాలికపై అత్యాచారానికి పాల్పడిన క్రికెటర్ కు.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

praveen
క్రికెట్ అనే ఆటకు ప్రపంచ దేశాల్లో ఉన్న ఆదరణ దృశ్య ఎవరైనా క్రికెటర్ కు సంబంధించిన విషయం తెరమీదకి వస్తే అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ప్రపంచం మొత్తం పాకుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎవరైనా క్రికెటర్ ఏకంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నాడు అంటే అది టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోతూ ఉంటుంది. గతంలో నేపాల్ జట్టు కెప్టెన్గా కొనసాగిన సందీప్ లమీచానే  పై ఇలాంటి ఆరోపణలువచ్చాయి. వచ్చే ఏకంగా తనపై అత్యాచారం చేశాడు అంటూ ఒక యువతి ఫిర్యాదు చేయగా అతని పోలీసులు అరెస్టు చేశారు.

 ఈ క్రమంలోనే నేపాల్ క్రికెట్ బోర్డు సైతం అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడంతో.. క్రికెట్ బోర్డును రిక్వెస్ట్ చేయగా ఇక నిషేధాన్ని ఎత్తు వేశారు. దీంతో మరోసారి ఇక క్రికెట్లో అడుగుపెట్టి కొన్ని టోర్నీలు ఆడాడు సందీప్ లమీచానే. కానీ కోర్టులు విచారణలో ఇక అతను నిజంగానే యువతిపై అత్యాచారం చేశాడు అన్న విషయం నిర్ధారణ కావడంతో మళ్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ నేపాల్ క్రికెటర్ కు 8 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు.

 దీంతో ఇది కాస్త ప్రస్తుతం క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఓ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో అతడికి ఇక ఈ శిక్ష పడింది అన్నది తెలుస్తుంది. గత ఏడాది కాట్మండు లోని ఒక హోటల్ లో సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఒక మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది అన్న విషయం తెలిసిందే  అయితే కేవలం జైలు శిక్ష మాత్రమే కాదు భారీ జరిమానా కూడా విధించింది కోర్టు. ఈ క్రమంలోనే తాను అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను అంటూ చెప్పాడు సందీప్ లమీచానే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: