టీమిండియాకు షాక్.. విరాట్ కోహ్లీ దూరం?

praveen
ప్రస్తుతం టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది. మొన్నటికీ మన సౌతాఫ్రికా పర్యటనను ముగించుకున్న టీమిండియా ఇక ఇప్పుడు భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే  అయితే ఇక ఈ టి20 సిరీస్ భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఎంతో ప్రత్యేకంగా మారబోతుంది. ఎందుకంటే 2022 t20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇక ఆఫ్గనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ కు సెలెక్ట్ అయ్యారు.

 ఈ క్రమంలోనే మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టి20 లో బరిలోకి దిగుతూ ఉండగా.. ఇక విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మట్లో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. 2024 t20 వరల్డ్ కప్ నేపథ్యంలో సీనియర్లు మళ్ళీ పొట్టి ఫార్మాట్లో మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమయ్యారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక 14 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ టి20 లలో  ఈ ఇద్దరు ఆటగాళ్ల బ్యాటింగ్ విధ్వంసాన్ని చూసేందుకు అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో టీమిండియా ఫ్యాన్స్ కి ఒక ఊహించని భారీ షాక్ తగిలింది.

  టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మొదటి టి20 మ్యాచ్ కు దూరం కాబోతున్నాడట. అదేంటి కోహ్లీకి గాయం అయిందా అంటారా.. అలాంటి కంగారు పడాల్సిన అవసరమే లేదు. వ్యక్తిగత కారణాలతో కింగ్ కోహ్లీ మొదటి మ్యాచ్ ఆడట్లేదని ఇటీవలే కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపాడు. అయితే రోహిత్ శర్మ మాత్రం ఇక మూడు టి20 మ్యాచ్లలో ఆడుతాడు అంటూ చెప్పుకొచ్చాడు.  ఈ విషయం తెలిసి కోహ్లీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కోహ్లీ ఆట తీరును చూద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి.. పోనీలే రెండో టి20 మ్యాచ్ నుంచి అయినా కింగ్ ఆటను చూస్తాం అంటూ సర్ది చెప్పుకుంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: