క్రమశిక్షణ చర్యలు కాదు.. ఆ ఇద్దరిని అందుకే తీసుకోలేదు : ద్రావిడ్

praveen
ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్ని ముగిసిన తర్వాత టీమ్ ఇండియా వరుస ద్వైపాక్షిక సిరీస్  సీరిస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడబోతుంది భారత జట్టు. ఇక ఇప్పటికే జట్టు వివరాలను కూడా బీసీసీఐ ప్రకటించింది అన్న విషయం తెలిసిందే  అయితే ఆఫ్గనిస్తాన్ తో జరగబోయే టి20 సిరీస్ కోసం ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదు.

 ఇద్దరు ప్లేయర్లను కూడా జట్టులోకి సెలెక్ట్ చేయలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే బీసీసీఐ సెలెక్దర్లు ఈ ఇద్దరు ప్లేయర్లపై వేటు వేశారు అంటూ కొన్ని వార్తలు తెరమీదకి వచ్చి వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లను ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టి20 సిరీస్ ఎంపిక చేయలేదు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికా టూర్ మధ్యలో బ్రేక్ కావాలని ఇషాన్ కిషన్ కోరడంతో అంగీకరించాము అంటూ రాహుల్ ద్రావిడ్ తెలిపాడు.

 అయితే స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మూడు మ్యాచ్ల టి20 సిరీస్ కు తాను అందుబాటులో ఉంటాను అన్న సమాచారాన్ని ఇషాన్ కిషన్ మాకు అందించలేదు అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. అతడు మళ్ళీ భారత జట్టులోకి రావాలి అంటే దేశవాళీ టోర్నీలో ఆడి నిరూపించుకోవాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టి20 ఫార్మాట్లో జితేశ్ శర్మకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తుంది అంటూ తెలిపాడు. అయితే శ్రేయస్ అయ్యర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు అంటూ వస్తున్న వార్తలను ఖండించాడు రాహుల్. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేయలేదని.. ప్రస్తుతం అతను ముంబై తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: