కెప్టెన్ గా.. ధోని రికార్డు పై కన్నేసిన రోహిత్?

praveen
టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఎలా రాణించబోతున్నాడు అనే విషయం గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అదేంటి రోహిత్ శర్మ కొత్తగా రాణించడమేంటి.. ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు కదా అంటారా.. అయితే ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. కానీ ఇప్పుడు 14 నెలల గ్యాప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో మ్యాచ్ లు ఆడబోతున్నాడు రోహిత్ శర్మ. దీంతో అతను ఆఫ్గనిస్తాన్తో జరగబోయే టి20 సిరీస్ లో ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నాడు అని అందరూ చర్చించుకుంటున్నారు. 2022 t20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ ఒకసారి కూడా ఈ ఫార్మాట్లో మ్యాచ్లు ఆడలేదు.

 రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా టి20 ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడు అంటే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఇక బీసీసీఐ ఇలాంటి ప్రాణాలికతో ముందుకు సాగింది అని అందరూ అనుకున్నారు. అయితే ఇక ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో  రోహిత్ శర్మ మళ్ళీ పొట్టి ఫార్మాట్లోకి అడుగు పెట్టాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో మళ్ళీ కెప్టెన్సీ చేపట్టి జట్టును  నడిపించబోతున్నాడు. ఇక నేటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ టీమిండియా మధ్య టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే  ఆఫ్ఘనిస్తాన్  తో జరగబోయే మూడు మ్యాచ్ల టి20 సిరీస్ రోహిత్ శర్మను ఎన్నో అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి అన్నది తెలుస్తుంది. టి20 ఫార్మాట్లో భారత్ కెప్టెన్ గా అత్యధిక విజయాలు అందుకున్న సారధిగా మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు. ధోని సారథిగా ఉన్నప్పుడు టీ20 ఫార్మాట్లో 42 విజయాలు సాధించాడు. అయితే రోహిత్ కెప్టెన్సీలో ఆఫ్ఘనిస్తాన్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే.. రోహిత్ ధోని రికార్డును సమం చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం కెప్టెన్ గా 51 మ్యాచ్లలో 39 విజయాలు అందించాడు రోహిత్ శర్మ.  మరి ఆఫ్ఘనిస్తాన్తో టి20 సిరీస్ లో అద్భుతంగా రానించి ధోని రికార్డును సమం చేస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: