వారెవ్వా.. ఐపీఎల్ ఫ్యాన్స్ కి.. ఇంతకంటే పెద్ద గుడ్ న్యూస్ ఉంటుందా?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక వరల్డ్ క్రికెట్లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతున్న ఐపీఎల్లో భాగం కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక 2008 నుంచి కూడా ఐపీఎల్ అటు ఇండియా వేదికగా జరుగుతూ వస్తుంది.

 కానీ గతంలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇండియాలో కాకుండా యూఏఈ వేదికగా ఐపిఎల్ టోర్నీనీ నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్ళీ భారత్ లోనే బిసిసిఐ ఇక ఈ టోర్ని నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే ఇక 2024 ఐపీఎల్ సీజన్ ఇండియాలో నిర్వహిస్తారా లేదా అనే విషయంపై మాత్రం సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ దేశంలో నిర్వహించే అవకాశం ఉందని.. గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.

 దీంతో ఇక ఐపీఎల్ మ్యాచ్లను ప్రత్యక్షం గా వెళ్లి చూడలేమా అని కొంత మంది భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా అటు నిరాశ చెందారు. అయితే ఈ విషయం లో అందరికీ గుడ్ న్యూస్ అందింది. భారత్ లోనే ఐపిఎల్ టోర్నమెంట్ జరిగే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎన్నికల సమయంలో మ్యాచ్ నిర్వహణకు ఏ వేదికలో అయిన ఇబ్బంది ఉంటే మరో వేదికలోకి మ్యాచ్ మారుస్తామని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా మార్చ్ 22వ తేదీ నుంచి కూడా టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: