ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ముగ్గురు.. ఇండియా నుంచి ఒక్కరూ లేరుగా?

praveen
2023 ఏడాది ముగిసింది.. ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం 2024 ఏడాదిలోకి అడుగుపెట్టి సరికొత్తగా ఈ న్యూ ఇయర్ ని ప్రారంభించింది.  అయితే అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఇక 2024లో తమ అభిమాన జట్టు అద్భుతంగా రానించాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఇక 2023 మిగిల్చిన మధుర జ్ఞాపకాలను ఎన్నో చేదు అనుభవాలను కూడా నెమరు వేసుకుంటూ ఉంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడు ఇక అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవార్డులు ప్రకటించే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. ఇక ఇప్పుడు ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ఇచ్చేందుకు రెడీ అయింది..

 అదే సమయంలో ఇక డిసెంబర్ నెలలకు గాను ఇక అత్యంత ప్రదర్శన చేసిన ప్లేయర్లను ఎంపిక చేసి క్లియర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించడానికి సిద్ధమైంది ఐసీసీ. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో ఎవరు మంచి ప్రదర్శన చేశారు అని తెలుసుకోవడానికి అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల డిసెంబర్ నెలకు కాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో ఉన్న ముగ్గురు ఆటగాళ్ల వివరాలను ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.

 అయితే ఐసీసీ ప్రకటించిన ఈ లిస్టులో అటు భారత జట్టు నుంచి ఒక్కరు కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో నిలవకపోవడం గమనార్హం. అయితే ఇక డిసెంబర్ నెలలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో నామినేట్ అయిన ఆటగాళ్ళ వివరాలు చూసుకుంటే.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ తో పాటు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్ ఇస్లాం ఈ అవార్డు రేసులో నామినేట్ అయ్యారు అని చెప్పాలి. ఇక మహిళల విభాగంలో భారత క్రికెటర్లు జేమియా రోడ్రిక్స్ భారత బౌలర్ దీప్తి శర్మ, జింబాబ్వే ప్లేయర్ ప్రిసియస్ మారంగే ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: