అరెరే.. భారత టూరిజం గొప్పతనం గురించి.. ధోని అప్పుడే చెప్పాడుగా?

praveen
గత కొన్ని రోజుల నుంచి మాల్దీవ్స్, భారత్ పర్యాటక ప్రాంతం మధ్య వివాదం చెలరేగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇండియాలోని లక్షద్వీప్ కు వెళ్లారు. అంతేకాదు ఇక ఈ పర్యటక ప్రాంతం అద్భుతంగా ఉందని.. ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏకంగా మాల్దీవ్స్ మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలకు దిగారు అని చెప్పాలి. దీంతో ఒక పెద్ద వివాదం తెరమీదకి వచ్చింది. ఇదే విషయంపై  ఎంతో మంది క్రీడా రాజకీయ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

 భారత పర్యాటకాన్ని ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉందని.. మాల్దీవ్స్ కంటే గొప్ప పర్యటక ప్రాంతాలు భారత్ లో చాలానే ఉన్నాయి అంటూ వీరేంద్ర సెహ్వాగ్, అమితాబచ్చన్  లాంటి పలువురు ప్రముఖులు ఈ విషయంపై స్పందించారు అని చెప్పాలి. అయితే ఇలా మాల్దీవ్స్ లక్షద్వీప్స్ మధ్య చర్చ జరుగుతూ ఉండగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇక భారత పర్యాటకం గొప్పతనాన్ని చెప్పిన  ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోని ప్రస్తుతం ధోని అభిమానులు అందరూ కూడా తెగ వైరల్ గా మార్చేస్తున్నారు.

 నాకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. అయితే అది వెకేషన్ కోసం కాదు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నప్పుడు ఎన్నో దేశాలకు వెళ్లాల్సి వస్తుంది. మ్యాచ్లు ముగిసిన వెంటనే అక్కడ ఎంజాయ్ చేయకుండా భారత్ కి వచ్చేవాడిని. ఎందుకంటే నా భార్య సాక్షికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. ప్రస్తుతం క్రికెట్ కు రిటైర్మెంట్ పలకడంతో టైం దొరుకుతుంది. దీంతో పర్యటక ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. అయితే కచ్చితంగా నేను మన దేశం నుంచే పర్యటనలను ప్రారంభిస్తాను అంటూ ధోని చెప్పుకొచ్చాడు. ఇండియాలో చాలా అందమైన పర్యటక ప్రాంతాలు ఉన్నాయని తమ పర్యటనలో విదేశాల కంటే ముందు మన దేశంలోనే సుందరమైన ప్రాంతాలను సందర్శించాలని భావిస్తున్నట్లు ధోని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మాల్దీవ్స్ తో  వివాదం నేపథ్యంలో ధోని గతంలో చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: