ఆసీస్ క్రికెటర్ అరుదైన రికార్డ్.. వరల్డ్ క్రికెట్లో మూడో ప్లేయర్?

praveen
ఇటీవల కాలంలో మెన్స్ క్రికెటర్ కు మేము ఎక్కడ తక్కువ కాదు అనే రీతిలో మహిళా క్రికెటర్లు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా రికార్డులు కొల్లగొట్టడమే లక్ష్యంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి ఇలా మహిళా క్రికెటర్లు సాధించిన ఎన్నో రికార్డులు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇటీవలే ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఆల్ రౌండర్  అరుదైన ఘనతను సాధించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అటు ఇండియా పర్యటనకు వచ్చింది  ఈ క్రమంలోనే ఆతిధ్య భారత జట్టుతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతోంది అని చెప్పాలి. అయితే ఇటీవల భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియం వేదికగా రెండో టి20 మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ రెండో టి20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ఎల్లిస్ పెర్రి అరుదైన ఘనత సాధించింది  ఏకంగా ఇంటర్నేషనల్ టీ20 కెరియర్ లో 3 మ్యాచ్లను పూర్తి చేసుకుంది ఈ స్టార్ ప్లేయర్.

 ఏకంగా మహిళల క్రికెట్ చరిత్రలో 300 ప్లస్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన వారిలో ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే ఉన్నారు అని చెప్పాలి. ఇందులో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్ తో ఎల్లీస్ పెర్రి ఇక వీరి సరసన చేరిపోయింది. కాగా మిథాలీ రాజ్ ఇప్పటివరకు టి20 కెరియర్ లో 33 మ్యాచ్ లు ఆడితే ఇంగ్లాండ్ దిగ్గజం చార్లెస్ ఎడ్ వర్డ్స్ 309, కివిస్ మాజీ బ్యాట్స్మెన్ సూచి బెడ్స్ 309 మ్యాచ్ లు ఆదారు. అంతేకాకుండా ఇక ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో ఇలా 300 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఏకైక ప్లేయర్గా రికార్డు సృష్టించింది ఎల్లిస్ పెర్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: