పూజరా డబుల్ సెంచరీ.. సెలెక్టర్ల మొహం మీద కొట్టినంత పని చేశాడుగా?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో పోటీ ఎంత ఎక్కువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభ తెర మీదికి వస్తూనే ఉంది అని చెప్పాలి. క్రమంలోనే యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇక టీమిండియాలో కీలక ప్లేయర్గా మారిపోవాలని ఎంతగానో కష్టపడి పోతున్నారు. ఇక ఇలాంటి సమయంలో అప్పటికే తామేంటో నిరూపించుకునే ఎంతోమందిప్లేయర్లు మళ్ళీ కొత్తగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

 ఇక ఎవరైనా సీనియర్ ప్లేయర్ విఫలం అయ్యాడు అంటే చాలు అతన్ని నిర్మొహమాటంగా అటు సెలెక్టర్లు కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఇలా ఇటీవలే కాలంలో ఒకప్పుడు స్టార్లుగా వెలుగొందిన ఎంతో మంది సీనియర్లు ఇప్పుడు కనీసం జట్టులో కూడా చోటు సంపాదించుకోలేక ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు అని చెప్పాలి. అలాంటి వారిలో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పూజార కూడా ఒకరు. భారత జట్టు ఏదైనా టెస్ట్ మ్యాచ్ ఆడింది అంటే చాలు ఇక ఈ స్టార్ బ్యాట్స్మెన్ లేకుండా జట్టును ప్రకటించడం జరిగేది కాదు. ఒకప్పుడు తన ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. టీమిండియా నయావాల్ అనే బిరుదును కూడా అందుకున్నాడు.

 కానీ ఇప్పుడు కనీసం అతనికి జట్టులో కూడా చోటు తగ్గడం లేదు. తనను సెలెక్టర్లు పక్కన పెడుతున్నారు అన్న కోపమో లేకపోతే నేనేంటో అందరికీ మళ్లీ అర్థమయ్యేలా చేయాలి అన్న కసో తెలియదు కానీ.. ఇక ఇటీవల డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు.  రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర  జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పూజార ఝార్ఖండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలోనే అతని ప్రదర్శన పై  అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లో అతని పక్కన పెట్టగా బ్యాటర్లు మొత్తం పూర్తిగా విఫలం కావడంతో ఈ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ను తీసుకొని ఉంటే బాగుండేదని ఎంతోమంది మాజీ ప్లేయర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: